Team Coach: పాక్ టెస్ట్ జట్టు కోచ్‌గా అజర్ మహమూద్
ABN, Publish Date - Jul 01 , 2025 | 03:35 AM
మాజీ ఆల్‌రౌండర్ అజర్ మహమూద్ పాకిస్థాన్ టెస్ట్ జట్టు కోచ్‌గా పదోన్నతి పొందాడు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో అతడి పదవీకాలం ముగిసే వరకు ఈ బాధ్యతలు నిర్వర్తిస్తాడని...
లాహోర్: మాజీ ఆల్‌రౌండర్ అజర్ మహమూద్ పాకిస్థాన్ టెస్ట్ జట్టు కోచ్‌గా పదోన్నతి పొందాడు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో అతడి పదవీకాలం ముగిసే వరకు ఈ బాధ్యతలు నిర్వర్తిస్తాడని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సోమవారం తెలిపింది. అన్ని ఫార్మాట్ల జట్లకు సహాయ కోచ్‌గా అజర్ గత ఏప్రిల్‌లో నియమితుడయ్యాడు. అప్పట్లో గిలెస్పీ (టెస్ట్‌లు), కిర్‌స్టెన్ (పరిమిత ఓవర్లు)లను కోచ్‌లుగా నియమించింది. అయితే కొద్దికాలానికే వారిద్దరూ వైదొలిగారు. అజర్ 21 టెస్ట్‌లు, 143 వన్డేలు ఆడాడు.
Updated Date - Jul 01 , 2025 | 03:37 AM