ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆయుష్‌కు అండర్‌ 19 పగ్గాలు

ABN, Publish Date - May 23 , 2025 | 05:10 AM

ఐపీఎల్‌లో అదరగొడుతున్న యువ సంచలన బ్యాటర్లు ఆయుష్‌ మాత్రే, వైభవ్‌ సూర్యవంశీలపై సెలెక్టర్ల దృష్టి పడింది. వచ్చే నెలలో ఇంగ్లండ్‌లో పర్యటించే భారత అండర్‌-19 జట్టు కెప్టెన్‌గా మాత్రేను ఎంపిక...

వైభవ్‌ సూర్యవంశీకి చోటు

ఇంగ్లండ్‌ టూర్‌కు భారత జట్టు ఎంపిక

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో అదరగొడుతున్న యువ సంచలన బ్యాటర్లు ఆయుష్‌ మాత్రే, వైభవ్‌ సూర్యవంశీలపై సెలెక్టర్ల దృష్టి పడింది. వచ్చే నెలలో ఇంగ్లండ్‌లో పర్యటించే భారత అండర్‌-19 జట్టు కెప్టెన్‌గా మాత్రేను ఎంపిక చేశారు. జూన్‌ 24 నుంచి జూలై 23 వరకు ఇంగ్లండ్‌ అండర్‌-19తో భారత కుర్రాళ్లు ఐదు యూత్‌ వన్డేలు, రెండు నాలుగు రోజుల టెస్టులు ఆడనున్నారు. జట్టులో మొత్తం 16 మంది ఆటగాళ్లున్నారు. జట్టులో హైదరాబాద్‌కు చెందిన వికెట్‌ కీపర్‌ రాపోలు అలంకృత్‌ స్టాండ్‌బై ఆటగాడిగా ఎంపికయ్యాడు. కాగా వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన 17 ఏళ్ల మాత్రే చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ రుతురాజ్‌ గాయపడడంతో జట్టులోకి వచ్చి ఓపెనర్‌గా చెలరేగుతున్నాడు. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనే 206 పరుగులు సాధించాడు. ఇక 14 ఏళ్ల వైభవ్‌ విధ్వంసం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఓ మెరుపు శతకం కూడా బాదేయడంతో తనకు అండర్‌-19 జట్టులో చోటు ద్వారా ప్రమోషన్‌ లభించినట్టయ్యింది.

ఇవీ చదవండి:

14 ఏళ్లకే ఇంత క్రేజా!

సాకులు చెబుతున్న ధోని

బీసీసీఐపై ఫ్రాంచైజీలు సీరియస్!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 23 , 2025 | 05:10 AM