Ashwin Karma Comment: కర్మ ఎవర్నీ వదిలిపెట్టదు
ABN, Publish Date - Aug 07 , 2025 | 02:57 AM
‘కర్మ’ ఎవరినీ వదలిపెట్టదని, అది వెంటాడుతూనే ఉంటుందని ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్‌నుద్దేశించి భారత జట్టు మాజీ స్పిన్నర్ అశ్విన్ అన్నాడు. ఇంగ్లండ్‌తో మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్ట్ తొలిరోజు ఆటలో భారత కీపర్ పంత్ తీవ్రంగా...
స్టోక్స్‌కు అశ్విన్ చురక
న్యూఢిల్లీ: ‘కర్మ’ ఎవరినీ వదలిపెట్టదని, అది వెంటాడుతూనే ఉంటుందని ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్‌నుద్దేశించి భారత జట్టు మాజీ స్పిన్నర్ అశ్విన్ అన్నాడు. ఇంగ్లండ్‌తో మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్ట్ తొలిరోజు ఆటలో భారత కీపర్ పంత్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. కుడి పాదానికి ఫ్రాక్చర్ అయినా పంత్ రెండో రోజు బ్యాటింగ్‌కు దిగాడు. ఈ నేపథ్యంలో..గాయపడిన వారి స్థానంలో సబ్‌స్టిట్యూట్ ఆటగాడిని అనుమతించే విధానం టెస్ట్ క్రికెట్‌లో ప్రవేశపెట్టాలని భారత జట్టు కోచ్ గంభీర్ సూచించాడు. కానీ గంభీర్ సూచన ‘హాస్యాస్పదం’గా ఉందంటూ స్టోక్స్ కొట్టి పారేశాడు. అయితే చివరి టెస్ట్‌లో ఇంగ్లండ్‌కూ అదే పరిస్థితి ఎదురైంది. భుజం గాయమైనా ఇంగ్లండ్ పేసర్ వోక్స్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. దీనిపై అశ్విన్ స్పందిస్తూ ‘నీ కర్మ నీపై తక్షణమే ప్రభావం చూపుతుంది. నువ్వు ఏది విత్తుతావో అదే నీకు దక్కుతుంది’ అని వ్యాఖ్యానించాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
అవినీతి, ఆశ్రిత పక్షపాతంతోనే ప్రాజెక్ట్ నిర్మాణం: సీఎం రేవంత్ రెడ్డి
Read latest Telangana News And Telugu News
Updated Date - Aug 07 , 2025 | 08:55 AM