Chennai Grandmasters 2025: అర్జున్ గెలుపు
ABN, Publish Date - Aug 08 , 2025 | 03:08 AM
చెన్నై గ్రాండ్ మాస్టర్స్‌లో తెలుగు జీఎం అర్జున్ ఇరిగేసి శుభారంభం చేయగా.. ద్రోణవల్లి హారికకు షాక్ తగిలింది. గురువారం జరిగిన ఓపెన్ తొలి రౌండ్‌లో అమెరికా జీఎం అవోండర్ లియాంగ్‌పై అర్జున్ నెగ్గాడు...
హారిక పరాజయం
చెన్నై గ్రాండ్ మాస్టర్స్ టోర్నీ
చెన్నై: చెన్నై గ్రాండ్ మాస్టర్స్‌లో తెలుగు జీఎం అర్జున్ ఇరిగేసి శుభారంభం చేయగా.. ద్రోణవల్లి హారికకు షాక్ తగిలింది. గురువారం జరిగిన ఓపెన్ తొలి రౌండ్‌లో అమెరికా జీఎం అవోండర్ లియాంగ్‌పై అర్జున్ నెగ్గాడు. తెల్లపావులతో ఆడిన అర్జున్ 48 ఎత్తుల్లో ప్రత్యర్థి ఆటకట్టించాడు. సహచరులు ప్రణవ్-కార్తికేయన్ మురళీ మధ్య గేమ్ డ్రాగా ముగిసింది. విన్సెంట్ కీమర్ (జర్మనీ) చేతిలో నిహాల్ సరీన్ పరాజయం పాలయ్యాడు. చాలెంజర్స్ విభాగం తొలి రౌండ్‌లో సహచర జీఎం దీప్తయాన్ ఘోష్ చేతిలో హారిక ఓడింది. ఇనియన్‌తో గేమ్‌ను వైశాలి డ్రా చేసుకొంది.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 08 , 2025 | 03:44 PM