Uppal Stadium: హెచ్‌సీఏలో మరో వివాదం.. ఉప్పల్ స్టేడియం నార్త్ స్టాండ్‌కు అజారుద్దీన్ పేరు తొలగింపు
ABN, Publish Date - Apr 19 , 2025 | 06:35 PM
ఇప్పటికే సన్‌రైజర్స్‌తో వివాదంలో మునిగిన హెచ్‌సీఏ తాజాగా స్టేడియం నార్త్ స్టాండ్ పేరు విషయంలో సమస్య ఎదుర్కొంటోంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలోని నార్త్ స్టాండ్ పేరు వివాదాస్పదంగా మారింది.
వివాదంలో మునిగిన హెచ్‌సీఏ తాజాగా ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) నార్త్ స్టాండ్ పేరు విషయంలో సమస్య ఎదుర్కొంటోంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలోని నార్త్ స్టాండ్ పేరు వివాదాస్పదంగా మారింది. ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్‌కు భారత మాజీ క్రికెటర్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin) పేరు ఉండేది.
ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్‌కు అజారుద్దీన్ పేరు తొలగించాలని హెచ్‌సీఏ అంబుడ్స్‌మెన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశాలు జారీ చేశారు. లార్డ్స్ క్రికెట్ క్లబ్ వేసిన పిటిషన్‌పై ఈశ్వరయ్య విచారణ చేపట్టారు. ఉప్పల్ స్టేడియంలోని ఓ స్టాండ్‌కు హెచ్‌సీఏ అధ్యక్షుడైన అజారుద్దీన్ తన పేరు పెట్టుకోవాలని నిర్ణయించడం చెల్లదని, అందులో విరుద్ధమైన ప్రయోజనాలున్నాయని ఈశ్వరయ్య పేర్కొన్నారు. ఈ కారణంగానే నార్త్ స్టాండ్‌కు ఇకపై అజారుద్దీన్ పేరు ఉండకూడదని ఆదేశించారు. మ్యాచ్‌ల కోసం విక్రయించే టిక్కెట్లపై కూడా అజారుద్దీన్ ప్రస్తావన ఉండకూడదని పేర్కొన్నారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 19 , 2025 | 09:10 PM