ఆసియా క్వాలిఫయర్స్ టైటిళ్లు కైవసం
ABN, Publish Date - Apr 21 , 2025 | 03:01 AM
భారత యువ స్టార్లు అనహత్ సింగ్, వీర్ చోత్రాని ఈ ఏడాది ప్రపంచ స్క్వాష్ చాంపియన్‌షి్‌పనకు అర్హత సాధించారు. మలేసియాలోని కౌలాలంపూర్‌లో ఆదివారం జరిగిన ఆసియా...
‘ప్రపంచ స్క్వాష్’కు అనహత్, వీర్
న్యూఢిల్లీ: భారత యువ స్టార్లు అనహత్ సింగ్, వీర్ చోత్రాని ఈ ఏడాది ప్రపంచ స్క్వాష్ చాంపియన్‌షి్‌పనకు అర్హత సాధించారు. మలేసియాలోని కౌలాలంపూర్‌లో ఆదివారం జరిగిన ఆసియా క్వాలిఫయర్స్‌లో విజేతలుగా నిలిచి ప్రపంచ టోర్నీకి బెర్త్ దక్కించుకున్నారు. మహిళల ఫైనల్లో 17 ఏళ్ల అనహత్ 11-4, 9-11, 11-2, 11-8తో టోబీ సే (హాంకాంగ్)ను ఓడించింది. పురుషుల టైటిల్ పోరులో 23 ఏళ్ల వీర్ 11-3, 11-4, 11-8తో అమీషెన్‌రాజ్ (మలేసియా)పై గెలిచాడు. ప్రపంచ చాంపియన్‌షిప్ వచ్చేనెల 9 నుంచి 17 వరకు చికాగోలో జరగనుంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 21 , 2025 | 03:01 AM