సెమీస్‌కు అనహత్ వీర్
ABN, Publish Date - Apr 19 , 2025 | 03:54 AM
ప్రపంచ స్క్వాష్ చాంపియన్‌షిప్ క్వాలిఫయింగ్ ఈవెంట్ (ఆసియా)లో భారత స్టార్లు అనహత్ సింగ్, వీర్ చోత్రాని పతకాల దిశగా దూసుకెళుతున్నారు...
కౌలాలంపూర్: ప్రపంచ స్క్వాష్ చాంపియన్‌షిప్ క్వాలిఫయింగ్ ఈవెంట్ (ఆసియా)లో భారత స్టార్లు అనహత్ సింగ్, వీర్ చోత్రాని పతకాల దిశగా దూసుకెళుతున్నారు. మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో 17 ఏళ్ల అనహత్ 11-1, 11-7, 11-5తో జపాన్‌కు చెందిన అకారి మిదోరికవాను ఓడించి సెమీఫైనల్ చేరింది. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ వీర్ చోత్రాని 9-11, 11-6, 11-6, 11-7తో ఆరో సీడ్ మహ్మద్ సైఫిక్ కమల్ (మలేసియా)పై గెలిచాడు. సెమీఫైనల్స్‌లో 8వ సీడ్ హెలెన్ తాంగ్ (హాంకాంగ్)తో అనహత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టోర్నీ విజేతలు వచ్చేనెల 9 నుంచి 17 వరకు చికాగోలో జరిగే ప్రపంచ చాంపియన్‌షి్‌పకు అర్హత సాధిస్తారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 19 , 2025 | 03:54 AM