ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Wimbledon: అమందా సంచలనం

ABN, Publish Date - Jul 11 , 2025 | 02:05 AM

వింబుల్డన్‌లో అమెరికా భామ అమందా అనిసిమోవా పెను సంచలనం సృష్టించింది. ఏకంగా టాప్‌ సీడ్‌ అర్యానా సబలెంకను ఓడించి.. కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది...

  • తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ బెర్త్‌

  • సెమీ్‌సలో టాప్‌ సీడ్‌ సబలెంకకు షాక్‌

  • తుదిపోరులో స్వియటెక్‌తో ఢీ

లండన్‌: వింబుల్డన్‌లో అమెరికా భామ అమందా అనిసిమోవా పెను సంచలనం సృష్టించింది. ఏకంగా టాప్‌ సీడ్‌ అర్యానా సబలెంకను ఓడించి.. కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరోవైపు 8వ సీడ్‌ ఇగా స్వియటెక్‌ మొదటిసారి వింబుల్డన్‌ తుది పోరుకు చేరుకొంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీ్‌సలో 13వ సీడ్‌ అమందా 6-4, 4-6, 6-4తో సబలెంకకు షాకిచ్చింది. 2 గంటల 36 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో సబలెంక 6 ఏస్‌లు కొడితే.. అనిసిమోవా 2 మాత్రమే సంధించింది. అమందా 13 విన్నర్లతో సబలెంకపై ఆధిపత్యం ప్రదర్శించింది. గ్రాస్‌ కోర్ట్‌ సెమీ్‌సలో ఓడడం సబలెంకకు ఇది మూడోసారి.

స్వియటెక్‌ జోరు: ఏకపక్షంగా సాగిన మరో సెమీస్‌ మ్యాచ్‌లో పోలెండ్‌ స్టార్‌ స్వియటెక్‌ సునాయాసంగా నెగ్గింది. స్వియటెక్‌ 6-2, 6-0తో బెలిండా బెన్సిక్‌ (స్విట్జర్లాండ్‌)ను వరుస సెట్లలో ఓడించింది. శనివారం జరిగే టైటిల్‌ ఫైట్‌లో అమండాతో అమీతుమీ తేల్చుకోనుంది. వీరిద్దరూ తొలిసారి ఫైనల్‌ చేరడంతో.. ఈసారి వింబుల్డన్‌కు కొత్త చాంపియన్‌ రావడం ఖాయమైంది.

హద్దుమీరిన ఆటగాళ్లకు ఫైన్‌: క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా రాకెట్లను విసిరికొట్టడం, సిబ్బందిని దూషించడం, క్రీడా పరికరాలపై అసహనాన్ని ప్రదర్శిస్తూ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్న ఆటగాళ్లపై వింబుల్డన్‌ నిర్వాహకులు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. మొత్తంగా ఏడుగురు పురుషులు, ఎనిమిది మంది మహిళలకు కలిపి సుమారు రూ. 60 లక్షల జరిమానా విధించారు.

ఇవి కూడా చదవండి

ఇన్‎కం ట్యాక్స్ 2025 కొత్త రూల్స్.. ఈ అప్‌డేట్ ప్రక్రియ తప్పనిసరి

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 11 , 2025 | 02:05 AM