కళ్లన్నీ ఛెత్రిపైనే
ABN, Publish Date - Mar 19 , 2025 | 05:11 AM
జట్టు కోసం రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కితీసుకొన్న భారత స్టార్ ఫుట్‌బాలర్ సునీల్ ఛెత్రి మరోసారి అభిమానులను అలరించనున్నాడు. బుధవారం మాల్దీవులతో జరిగే అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో...
మాల్దీవులతో భారత్ పోరు నేడు
షిల్లాంగ్: జట్టు కోసం రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కితీసుకొన్న భారత స్టార్ ఫుట్‌బాలర్ సునీల్ ఛెత్రి మరోసారి అభిమానులను అలరించనున్నాడు. బుధవారం మాల్దీవులతో జరిగే అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో ఛెత్రి బరిలోకి దిగనున్నాడు. ఏఎఫ్‌సీ ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో ఈనెల 25న జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. దీనికి సన్నాహకంగా ఈ మ్యాచ్‌ను భావిస్తున్నారు. సునీల్‌ను సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దించే అవకాశాలున్నాయి. గతేడాది జూలైలో ఛెత్రి కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.
ఇవీ చదవండి:
యుద్ధభూమిని వీడొద్దు: హార్దిక్
ఒక్క వీడియోతో దడ పుట్టిస్తున్న పంత్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Mar 19 , 2025 | 05:11 AM