ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భరణం రూ. 4.75 కోట్లు?

ABN, Publish Date - Mar 20 , 2025 | 04:00 AM

టీమిండియా స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌, ధనశ్రీ వర్మ పరస్పర అంగీకారంతో విడిపోయేందుకు సిద్ధమైన నేపథ్యంలో.. ఈ జంట విడాకులకు సంబంధించి ఓ కీలక అంశం...

చాహల్‌, ధనశ్రీ విడాకుల కేసులో తీర్పు నేడు!

న్యూఢిల్లీ: టీమిండియా స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌, ధనశ్రీ వర్మ పరస్పర అంగీకారంతో విడిపోయేందుకు సిద్ధమైన నేపథ్యంలో.. ఈ జంట విడాకులకు సంబంధించి ఓ కీలక అంశం వెలుగులోకి వచ్చింది. భరణం కింద ధనశ్రీకి రూ. 4.75 కోట్లు ఇచ్చేందుకు చాహల్‌ అంగీకరించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి రూ. 2.37 కోట్లు ఫిబ్రవరిలోనే చెల్లించినట్టు జాతీయ మీడియా పేర్కొంది. తమకు విడాకులు మంజూరు చేయాలంటూ ఇద్దరూ గతనెల 5న ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అయితే, పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నందున తమకు ఆరునెలల కూలింగ్‌ పీరియడ్‌ (చట్టప్రకారం విడిపోయేముందు ఆరునెలలు కలిసుండడం) నుంచి మినహాయింపు ఇవ్వాలన్న వారి అఽభ్యర్థనను ఫ్యామిలీ కోర్టు తిరస్కరించింది. దీన్ని బాంబే హైకోర్టులో సవాల్‌ చేయగా.. వీరికి అనుకూలంగా తీర్పు వచ్చింది.


ఈనెల 22 నుంచి జరిగే ఐపీఎల్‌లో ఆడాల్సి ఉండడంతో ఆలోపే విడాకుల అంశాన్ని తేల్చాలన్న చాహల్‌ వాదనతో ఏకీభవించిన హైకోర్టు గురువారం తీర్పు వెల్లడించాలంటూ ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. దీంతో వీరిద్దరి విడాకుల అంశంపై గురువారం తీర్పు వెలువడే అవకాశం ఉంది.

Updated Date - Mar 20 , 2025 | 04:00 AM