కేకేఆర్ చెంతకు అభిషేక్ నాయర్
ABN, Publish Date - Apr 20 , 2025 | 04:33 AM
భారత క్రికెట్ జట్టు మాజీ సహాయ కోచ్ అభిషేక్ నాయర్ తిరిగి కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో చేరాడు. టీమిండియా ఇటీవలి వరుస వైఫల్యాల నేపథ్యంలో...
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ సహాయ కోచ్ అభిషేక్ నాయర్ తిరిగి కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో చేరాడు. టీమిండియా ఇటీవలి వరుస వైఫల్యాల నేపథ్యంలో సహాయక సిబ్బందిపై బీసీసీఐ ఆగ్రహంగాఉంది. దీంతో నాయర్ సహా పలువురిపై వేటు వేసింది. అలాగే సీనియర్ ఆటగాళ్లతోనూ నాయర్‌కు అంతగా సఖ్యత లేదనే కథనాలు వినిపించాయి. అయితే బీసీసీఐ వేటు వేయడమే ఆలస్యం కేకేఆర్ అభిషేక్‌ను తమ సహాయక బృందంలో చేర్చుకుంది. శనివారమే తను జట్టులో చేరాడు. గతేడాది కోల్‌కతాకు గంభీర్ మెంటార్‌గా ఉన్నప్పుడు నాయర్ అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 20 , 2025 | 04:33 AM