అప్పుడు వాళ్లు ఇప్పుడు వీళ్లు
ABN, Publish Date - Jun 22 , 2025 | 05:10 AM
అది 2002.. భారత్-ఇంగ్లండ్ మధ్య ఇదే మైదానంలో మూడో టెస్ట్ .తొలి ఇన్నింగ్స్.. అప్పటి దిగ్గజ త్రయం సచిన్ (193), ద్రవిడ్ (148), కెప్టెన్ గంగూలీ (128) శతక మోత మోగించడంతో మనోళ్లు...
అది 2002.. భారత్-ఇంగ్లండ్ మధ్య ఇదే మైదానంలో మూడో టెస్ట్ .తొలి ఇన్నింగ్స్.. అప్పటి దిగ్గజ త్రయం సచిన్ (193), ద్రవిడ్ (148), కెప్టెన్ గంగూలీ (128) శతక మోత మోగించడంతో మనోళ్లు 628/8 భారీ స్కోరుతో డిక్లేర్ చేశారు. ఆపై స్పిన్ ద్వయం హర్భజన్ (3/40), కుంబ్లే (3/93)తోపాటు జహీర్, అగార్కర్ చెరో రెండేసి వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 273 పరుగులకే చాపచుట్టేసింది. ఫాలోఆన్‌లో కుంబ్లే (4/66) పాటు సంజయ్ బంగర్(2/54) సత్తా చాటడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 309 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా..భారత్ ఇన్నింగ్స్ 46 పరుగులతో ఘన విజయం సాధించి సిరీ్‌సను 1-1తో సమం చేసేందుకు బాటలు వేసుకుంది. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్‌లోనూ కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ పంత్ జైస్వాల్ సెంచరీలతో చెలరేగి 22 ఏళ్ల నాటి ఘనతను సమం చేశారు. మరి.. ఈ యువ త్రయం శతక మోత కూడా, నాటి తరహాలో మరో చారిత్రక విజయానికి మార్గం సుగమం చేస్తుందా? చూడాలి.
ఇవీ చదవండి:
41 పరుగుల గ్యాప్‌లో 7 వికెట్లు
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 22 , 2025 | 05:10 AM