వీధుల్లో శ్రేయస్ అయ్యర్ సందడి
ABN, Publish Date - May 06, 2025 | 12:16 PM
ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సందడి చేశారు. ఐపీఎల్ 2025లో భాగంగా 54వ మ్యాచ్ మే 4 ఆదివారం ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగింది. మ్యాచ్ అనంతరం ధర్మశాల వీధుల్లో శ్రేయస్ ఒంటరిగా నడుస్తూ వెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడితో పలువురు సెల్ఫీలు దిగారు.
Updated Date - May 06, 2025 | 12:16 PM