తాగిన మైకంలో హల్ చల్
ABN, Publish Date - Apr 21, 2025 | 06:46 PM
తాగిన మైకంలో ఎక్స్‌ప్రెస్ హైవేపై నుంచి దూకిన వ్యక్తి.. HYD: లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే పిల్లర్ నంబర్ 100 పై నుండి తాగిన మత్తులో కిందికి దూకాడు. మధ్యలో వైరును పట్టుకోవడంతో కాసేపు అక్కడే ఉండిపోయాడు. ఇది గమనించిన స్థానికులు కారులో నుండి కారు కవర్ను తీసుకొని నలుగురి సహాయంతో కింద తెరిచి పట్టుకోగా సదరు వ్యక్తి ఆ కారు కవర్‌పై పడటంతో ప్రమాదం తప్పింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Apr 21, 2025 | 06:46 PM