పంజాబ్లోని మోగాలో విచిత్ర ఘటన జరిగింది. దుకాణంలో ఒంటరిగా కూర్చున్న ఓ మహిళను బాబా రూపంలో వచ్చిన దొంగలు హిప్నటైజ్ చేశారు. కుటుంబానికి చెడు రోజులు రాబోతున్నాయని, ఒంటిపైనున్న బంగారు ఆభరణాలను తెల్లటి వస్త్రంలో కట్టి ఇవ్వాలని ఆమెను మభ్యపెట్టాడు. బంగారం తీసి ఇచ్చగా మంత్రం వేసినట్లు చేసి మూటను మార్చేశాడు. ఆమె తేరుకొని చూసేసరికి మూటలో బంగారం బదులు గడ్డి కనిపించింది. ఈ ఘటన సీసీటీవీ వీడియో వైరల్ అవుతోంది.