Funny Viral Video: ఈమె తెలివికి కాళ్లు మొక్కాల్సిందే.. ఆమె చేసిన పని చూస్తే ఆశ్చర్యంతో షాక్ అవక తప్పదు..
ABN, Publish Date - Jan 30 , 2025 | 05:44 PM
ప్రతిరోజూ ప్రజలు సోషల్ మీడియాలో అనేక వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. వాటిల్లో కొన్ని చాలా మందిని ఆకట్టుకుని వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా, మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా ప్రపంచం చాలా భిన్నంగా ఉంటుంది. విచిత్రమైన పనులు చేసే వ్యక్తులు, ఆశ్చర్యపరిచే వీడియోలు ప్రతి రోజు మీ కళ్ల ముందుకు వస్తుంటాయి. ప్రతిరోజూ ప్రజలు సోషల్ మీడియాలో అనేక వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. వాటిల్లో కొన్ని చాలా మందిని ఆకట్టుకుని వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా, మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలోని మహిళ చర్య చూస్తే నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు (Viral Video).
@cctvidiots అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఫైర్ బ్రిగేడ్ టీమ్‌కు చెందిన కొందరు వ్యక్తులు తమ వాహనాన్ని పైప్ నీటితో కడుక్కుంటున్నారు. ఆ పైప్ రోడ్డు మీద పడి ఉంది. అటు వైపు వెళ్లేవారు ఎవరైనా మామూలుగా పైప్ (Water Pipe) దాటుకుని వెళ్లిపోతారు. అయితే ఓ మహిళ మాత్రం విచిత్రంగా ప్రవర్తించారు. నేల మీద పడి ఉన్న పైప్‌ను పైకి లేపి దాని కింద నుంచి వెళ్లింది. ఆమె చర్యను చూసి పక్కనే ఉన్న వ్యక్తి షాక్ అయ్యాడు. ఆమె ఎందుకలా చేసిందో అర్థం కాక అయోమయంలో పడ్డాడు. ఆ వీడియోను షేర్ చేసిన వ్యక్తి.. ``మీరు తర్వాతో ఏం చేస్తారో ఎవరూ అంచనా వేయకూడదు`` అని కామెంట్ చేశారు.
ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 2.94 లక్షల మంది వీక్షించారు. 4.4 వేల మందికి పైగా ఆ వీడియోను వీక్షించి తమ స్పందనలను తెలియజేశారు. ``ఆమె ఎందుకలా చేసిందో అర్థం కావడం లేదు``, ``కొందరు ప్రవహిస్తున్న నీటిని దాటడానికి ఇష్టపడరు``, ``ఆ వ్యక్తి కొన్ని సెకెన్ల పాటు ఆశ్చర్యపోయాడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion: ఈ మనుషుల మధ్యన పిల్లిని కనిపెడితే.. మీ కళ్లు చాలా పవర్‌ఫుల్ అని నమ్మాల్సిందే..
Strange Job: ఓర్నీ.. ఇలా కూడా కోట్లు సంపాదించవచ్చా? ఈ వ్యక్తి జాబ్ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే..
Viral Video: స్కూటీ మీద వేగంగా వెళ్తున్న యువతికి అడ్డొచ్చిన బారికేడ్.. ఆమె ఏం చేసిందో చూడండి..
Optical Illusion: మీ కంటి చూపు అద్భుతం అయితే.. ఈ బాత్రూమ్‌లో కారు బొమ్మ ఎక్కడుందో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Jan 30 , 2025 | 05:44 PM