Viral Video: స్కూటీ మీద వేగంగా వెళ్తున్న యువతికి అడ్డొచ్చిన బారికేడ్.. ఆమె ఏం చేసిందో చూడండి..
ABN , Publish Date - Jan 28 , 2025 | 03:50 PM
ప్రస్తుతం మహిళలు రెళ్లు, విమానాలు నడుపుతున్నప్పటికీ, బైక్‌లు, స్కూటీలు నడిపే విషయంలో మాత్రం కొందరు ఇప్పటికీ తడబడుతుంటారు. సిల్లీ మిస్టేక్స్ చేసి అనవసర ప్రమాదాలకు గురవుతుంటారు. లేదా ఎదుటి వారిని ప్రమాదాల బారిన పడేస్తుంటారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మహిళల డ్రైవింగ్‌కు (Driving) సంబంధించి అనేక ఫన్నీ వీడియోలు, మీమ్స్ సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం మహిళలు రెళ్లు, విమానాలు నడుపుతున్నప్పటికీ, బైక్‌లు, స్కూటీలు నడిపే విషయంలో మాత్రం కొందరు ఇప్పటికీ తడబడుతుంటారు (Women Bike driving). సిల్లీ మిస్టేక్స్ చేసి అనవసర ప్రమాదాలకు గురవుతుంటారు. లేదా ఎదుటి వారిని ప్రమాదాల బారిన పడేస్తుంటారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు (Viral Video).
@ShoneeKapoor అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. చాలా వాహనాలు రోడ్డుపై వెళ్తున్నట్లు కనిపిస్తోంది. పక్కగా ఓ మహిళ స్కూటీ మీద రోడ్డుకు చివరన వేగంగా వెళ్తోంది. ఆ సమయంలో ఆమెకు బారికేడ్లు అడ్డంగా వచ్చాయి. వాటిని చూసి ఆ మహిళ బ్రేక్‌లు వేయలేదు. నేరుగా వెళ్లి ఢీకొట్టి కింద పడిపోయింది. అదృష్టవశాత్తు వెనుక వాహనాలు ఏవీ రాలేదు. దీంతో ఆమెకు పెద్ద ప్రమాదం తప్పింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 25 వేల మందికి పైగా వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేసి దానిపై ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ``స్కూటీ మీద వెళ్తున్న మహిళలతో జాగ్రత్తగా ఉండాలి``, ``ఆమెకు ఎదురు రావడం ఆ బారికేడ్ల తప్పు``, ``ఆమెకు కళ్లు కనబడవేమో``, ``బారికేడ్‌ని చూసి ఆమె కంగారు పడింది. బ్రేకులు వెయ్యాలా? కాలితో ఆపాలో అర్థం కాలేదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion: మీ కంటి చూపు అద్భుతం అయితే.. ఈ బాత్రూమ్‌లో కారు బొమ్మ ఎక్కడుందో కనిపెట్టండి..
Viral Video: విమానంపై నేరుగా పడిన పిడుగు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. వీడియో వైరల్..
Viral Stunt Video: ఇతడి కోసం నాసా కూడా వెతుకుతోందట.. నీటిలో తడవకుండా ఎలా నడుస్తున్నాడంటే..
Viral Groom Video: ఇలాంటి పెళ్లి ఎక్కడా జరగదేమో.. పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన వరుడు ఏం చేశాడంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి