Share News

Viral Video: విమానంపై నేరుగా పడిన పిడుగు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. వీడియో వైరల్..

ABN , Publish Date - Jan 27 , 2025 | 05:15 PM

పిడుగులు సాధారణంగా ఎత్తైన బిల్డింగులు, చెట్ల మీద పడతాయి. ఆ సమయంలో అక్కడ ఉన్న వారు పిడుగుపాటు వలన తీవ్రంగా ప్రభావితమవుతారు. తాజాగా బ్రెజిల్‌లోని ఓ విమానాశ్రయంలో ఆగి ఉన్న విమానంపై నేరుగా పిడుగు పడింది. ఈ అద్భుత దృశ్యాన్ని ఎయిర్‌పోర్ట్‌లో నిల్చున్న వ్యక్తి తన కెమెరాలో రికార్డ్ చేశాడు.

Viral Video: విమానంపై నేరుగా పడిన పిడుగు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. వీడియో వైరల్..
Lightning strikes a flight

కుండపోత వర్షం పడుతున్న సమయంలో ఆకాశం ఉరుములు, మెరుపులతో అల్లకల్లోలంగా ఉంటుంది. చాలా సార్లు పిడుగులు (Lightning) పడతాయి. పిడుగులు సాధారణంగా ఎత్తైన బిల్డింగులు, చెట్ల మీద పడతాయి. ఆ సమయంలో అక్కడ ఉన్న వారు పిడుగుపాటు వలన తీవ్రంగా ప్రభావితమవుతారు. తాజాగా బ్రెజిల్‌ (Brazil)లోని ఓ విమానాశ్రయంలో (Airport) ఆగి ఉన్న విమానంపై (Flight) నేరుగా పిడుగు పడింది. ఈ అద్భుత దృశ్యాన్ని ఎయిర్‌పోర్ట్‌లో నిల్చున్న వ్యక్తి తన కెమెరాలో రికార్డ్ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో చాలా వేగంగా వైరల్ అవుతోంది (Viral Video).


@aviationbrk అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోను బ్రెజిల్‌లోని సావో పాలో గ్వారుల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిత్రీకరించారు. నగరం అంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్న సమయంలో విమానాశ్రయంలోని రన్‌వేపై ఉన్న బ్రిటిష్ ఎయిర్‌వేస్‌ విమానంపై పిడుగు పడింది. ఆ ఘటన చూసిన జనాలు ఒక్కసారిగా షాక్ అవ్వడమే కాకుండా భయంతో కేకలు వేశారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. మరణించలేదు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (Lightning strikes a flight).


పిడుగు పడిన తర్వాత విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. దీంతో విమానం 6 గంటల ఆలస్యంగా బయలుదేరింది. విమానంలో పిడుగు పడినప్పుడు లోపల కూర్చున్న ప్రయాణికులకు ఎలాంటి హానీ జరగదనే సంగతి తెలిసిందే. ఎందుకంటే పిడుగు పడినా ఎలాంటి నష్టమూ వాటిల్లకుండా, పిడుగు పాటును తట్టుకునే లోహంతో విమానాన్ని తయారు చేస్తారు. ఒకవేళ విమానంపై పిడుగు పడినా అది బయటి పొరను దాటి లోపలికి వెళ్లలేదు. కాగా, ప్రస్తుత వీడియోను 3 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు.


ఇవి కూడా చదవండి..

Optical Illusion Test: ఈ కూరగాయాల్లో క్యారెట్ ఎక్కడుందో కనిపెడితే.. మీ కంటి చూపు అద్భుతంగా ఉన్నట్టే లెక్క..


Viral Stunt Video: ఇతడి కోసం నాసా కూడా వెతుకుతోందట.. నీటిలో తడవకుండా ఎలా నడుస్తున్నాడంటే..


Viral Groom Video: ఇలాంటి పెళ్లి ఎక్కడా జరగదేమో.. పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన వరుడు ఏం చేశాడంటే..


Viral Monkey Video: కోతులతోనే చిలిపి పని.. వీడియో చూస్తే నవ్వాపుకోవడం కష్టం..


Viral Video: వేప పుల్లతో తోమిన పళ్లు అవి.. ఆ కుర్రాడి దంత శక్తిని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 27 , 2025 | 05:15 PM