Viral Stunt Video: ఇతడి కోసం నాసా కూడా వెతుకుతోందట.. నీటిలో తడవకుండా ఎలా నడుస్తున్నాడంటే..
ABN , Publish Date - Jan 27 , 2025 | 02:53 PM
సాధారణ వ్యక్తులు తమ రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే క్రమంలో తమ ట్యాలెంట్‌ను బయటకు తీస్తుంటారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అలాంటి భిన్నమైన వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లోని కొన్ని వీడియోలు చాలా మందిని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి.
సాధారణ వ్యక్తులు కూడా ఒక్కోసారి అసాధారణ ప్రతిభను (Talent) చూపిస్తుంటారు. తమ రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే క్రమంలో తమ ట్యాలెంట్‌ను బయటకు తీస్తుంటారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అలాంటి భిన్నమైన వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లోని కొన్ని వీడియోలు చాలా మందిని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలోని వ్యక్తి తన అద్భుత ట్యాలెంట్‌తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు (Viral Video).
@cctvidiots అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి సైకిల్ (Bicycle) మీద ఏదో మూటను పెట్టుకుని తీసుకెళ్తున్నాడు. ఒక చోట రోడ్డంతా బురద నీటితో నిండిపోయి నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఆ నీటిలో నడుచుకుంటూ వెళితే చెప్పులు పాడైపోవడం ఖాయం. దీంతో ఆ కుర్రాడు ఇంటి గోడ మీద నడవడం మొదలుపెట్టాడు. సైకిల్‌ను ఆసరగా చేసుకుని కాలితో గోడ మీద నడుచుకుంటూ ఆ బురద రహదారిని దాటేశాడు. దీంతో ఆ వ్యక్తి బురద అంటుకోకుండా రోడ్డును దాటేశాడమన్నమాట.
ఆ కుర్రాడి ట్యాలెంట్‌ను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 1.6 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. మూడు వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``నాసా వాళ్లు ఇలాంటి వారి కోసమే వెతుకుతున్నారు``, ``ఇతడిని చూస్తే స్పైడర్ మ్యాన్ కూడా సిగ్గుపడతాడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Groom Video: ఇలాంటి పెళ్లి ఎక్కడా జరగదేమో.. పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన వరుడు ఏం చేశాడంటే..
Viral Monkey Video: కోతులతోనే చిలిపి పని.. వీడియో చూస్తే నవ్వాపుకోవడం కష్టం..
Viral Video: వేప పుల్లతో తోమిన పళ్లు అవి.. ఆ కుర్రాడి దంత శక్తిని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితే.. ``8``ల మధ్యనున్న ``6``ను కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి