Share News

Viral Groom Video: ఇలాంటి పెళ్లి ఎక్కడా జరగదేమో.. పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన వరుడు ఏం చేశాడంటే..

ABN , Publish Date - Jan 27 , 2025 | 02:37 PM

పెళ్లి రోజున వధూవరులు బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి పీటలపై ఆసీనులవుతారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య పురోహితుడి సూచనల మేరకు పెళ్లి తంతును పూర్తి చేస్తారు. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ వివాహం చాలా ప్రత్యేకంగా నిలిచింది.

Viral Groom Video: ఇలాంటి పెళ్లి ఎక్కడా జరగదేమో.. పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన వరుడు ఏం చేశాడంటే..
groom became a priest

పెళ్లి (Marriage) అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరపురాని ఘట్టం. ఆ వేడుక కోసం వధూవరులు ప్రత్యేకంగా సిద్ధమవుతారు. బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి పీటలపై ఆసీనులవుతారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య పురోహితుడి (Priest) సూచనల మేరకు పెళ్లి తంతును పూర్తి చేస్తారు. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్‌లో (UttarPradesh) జరిగిన ఓ వివాహం చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఎందుకంటే ఆ వివాహంలో స్వయంగా వరుడే (Groom) తన పెళ్లికి సంబంధించిన మంత్రాలను చదువుకున్నాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది (Viral Video).


@Genzofficial అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ జిల్లాకు చెందిన వివేక్ కుమార్‌కు హరిద్వార్ జిల్లాకు చెందిన అనిల్ కుమార్ కుమార్తెతో వివాహం నిశ్చయమైంది. పెళ్లి రోజున వివేక్ కుమార్ ఊరేగింపుగా కల్యాణ మండపానికి చేరుకున్నాడు. వేదికపై వధూవరులిద్దరూ పూల దండలు మార్చుకున్నారు. అనంతరం హోమంతో పాటు ఇతర కార్యక్రమాలు చేయడానికి పూజారి సిద్ధమయ్యాడు. అయితే తన పెళ్లికి తానే స్వయంగా మంత్రాలు చదువుకుంటానని పూజారికి చెప్పాడు (groom became a priest).


పూజారి నిశబ్దంగా కూర్చుని ఉండగా వరుడు మంత్రాలను జపించడం ప్రారంభించాడు. వరుడు మంత్రాలను చదవడం ప్రారంభించగానే ఆ పెళ్లికి హాజరైన బంధువులందరూ కరతాళ ధ్వనులతో అతడిని అభినందించారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను వేల మంది వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు.


ఇవి కూడా చదవండి..

Viral Monkey Video: కోతులతోనే చిలిపి పని.. వీడియో చూస్తే నవ్వాపుకోవడం కష్టం..


Viral Video: వేప పుల్లతో తోమిన పళ్లు అవి.. ఆ కుర్రాడి దంత శక్తిని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..


Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితే.. ``8``ల మధ్యనున్న ``6``ను కనిపెట్టండి..


Funny Viral News: భర్త మొహానికి లాక్.. బోనులో బంధించిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే..


Snake bite video: పాపా.. పాముతో ఆటలాడితే అలాగే ఉంటుంది.. ఓ యువతి పరిస్థితి ఏమైందో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 27 , 2025 | 02:37 PM