Share News

Viral Monkey Video: కోతులతోనే చిలిపి పని.. వీడియో చూస్తే నవ్వాపుకోవడం కష్టం..

ABN , Publish Date - Jan 26 , 2025 | 08:19 PM

తాజాగా ఓ ఫన్నీ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి చేసిన పని కోతులను హడలెత్తించింది. దెబ్బకు ఆ కోతులన్నీ వెనుకా ముందూ చూడకుండా పరుగులు పెట్టాయి. ఆ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Monkey Video: కోతులతోనే చిలిపి పని.. వీడియో చూస్తే నవ్వాపుకోవడం కష్టం..
viral funny prank video

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటూ, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ ఫన్నీ వీడియో (Funny Videos) నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి చేసిన పని కోతులను (Monkeys) హడలెత్తించింది. దెబ్బకు ఆ కోతులన్నీ వెనుకా ముందూ చూడకుండా పరుగులు పెట్టాయి. ఆ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


@Siimplymee1234 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. చాలా కోతులు ఒకే చోట కూర్చొని ఉన్నాయి. అప్పుడు ఒక బాలుడు అక్కడకు వచ్చాడు. అక్కడ కింద ఉన్న ఓ వస్తువు మీద కప్పిన వస్త్రాన్ని తొలగించాడు. అక్కడ పులి బొమ్మ ఉంది. ఆ పులి బొమ్మను చూసి కోతులన్నీ హడలిపోయాయి. ఉన్నపళంగా అన్ని కోతులు అక్కడి నుంచి పారిపోయాయి. కొన్ని కోతులు స్తంభాలు కూడా ఎక్కేశాయి. పులి బొమ్మను చూసి కోతులు భయపడి పారిపోవడం చాలా మందికి నవ్వు తెప్పిస్తోంది.


ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 83 వేల మంది ఈ వీడియోను వీక్షించారు. 12 వందల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను వీక్షించారు. ఆ వీడియోపై తమ స్పందనలను తెలియజేశారు. ``మనిషి కోతులపై ప్రతీకారం తీర్చుకున్నాడు``, ``ఆ కుర్రాడు కోతి కంటే చిలిపిగా ఉన్నాడు``, ``ఆ కోతులు ఒక్కసారిగా హడలిపోయాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

Viral Video: వేప పుల్లతో తోమిన పళ్లు అవి.. ఆ కుర్రాడి దంత శక్తిని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..


Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితే.. ``8``ల మధ్యనున్న ``6``ను కనిపెట్టండి..


Funny Viral News: భర్త మొహానికి లాక్.. బోనులో బంధించిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే..


Snake bite video: పాపా.. పాముతో ఆటలాడితే అలాగే ఉంటుంది.. ఓ యువతి పరిస్థితి ఏమైందో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 26 , 2025 | 08:19 PM