ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Woman Fries Slippers: మలేషియాలో మామూలుగా ఉండదు.. వేడి వేడి చెప్పుల ఫ్రై రెడీ..

ABN, Publish Date - Jul 03 , 2025 | 09:01 AM

Woman Fries Slippers: చెప్పుల ఫ్రై అమ్మే షాపుల దగ్గర జనం పెద్ద సంఖ్యలో బారులు తీరి ఉన్నారు. ఇక, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Woman Fries Slippers

సాధారణంగా చైనా వాళ్లు తిండి విషయంలో ప్రపంచం మొత్తాన్ని షాక్ చేస్తూ ఉంటారు. కాదేదీ తినడానికి అనర్హం అన్నట్లు.. దేన్నీ వదిలిపెట్టకుండా తింటూ ఉంటారు. మన కడుపులో కలవరం సృష్టించే.. వెరైటీ వంటకాలు చైనా మార్కెట్లలో దర్శనం ఇస్తూ ఉంటాయి. అసలు విషయానికి వస్తే.. చైనా తర్వాతి స్థానాన్ని మలేషియా ఆక్రమించేలా ఉంది. మలేషియాలో చెప్పుల ఫ్రై అమ్ముతున్నారు. ఆ చెప్పుల ఫ్రైని జనం ఎంతో ఇష్టంగా తింటూ ఉన్నారు. చెప్పుల ఫ్రై తినటం ఏంటని ఆశ్చర్యపోకండి.

అవి నిజమైన చెప్పులు కాదు.. పిండితో చెప్పుల ఆకారంలో తయారు చేసిన వంటకాలు. డంప్లింగ్స్‌ని అలా చెప్పుల ఆకారంలో చేసి అమ్ముతున్నారు. వాటిని మలేషియా నైట్ మార్కెట్‌లో అమ్ముతూ ఉంటారు. ప్రస్తుతం చెప్పుల ఫ్రైకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఓ మహిళ చెప్పుల ఆకారంలోని డంప్లింగ్స్‌ను నిప్పులపై కాలుస్తూ ఉంది. ఓ వ్యక్తి వాటిని పెనంలో వేయిస్తూ ఉన్నాడు.

ఆ షాపుల దగ్గర జనం పెద్ద సంఖ్యలో బారులు తీరి ఉన్నారు. ఇక, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘అది నిజమైన వీడియో కాదు.. ఏఐతో తయారు చేసింది’..‘చైనాలోనే అనుకున్నాను.. మలేషియాలోనూ వింత మనుషులు ఉన్నారనమాట’..‘చెప్పు దెబ్బలు కాకుండా.. వీళ్లు ఏకంగా చెప్పుల్నే తినేస్తున్నారు. మామూలోళ్లు కాదు’అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఆ వీడియో ఏఐతో తయారు చేసింది కాదని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ భార్య మొండితనం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. ఏకంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఏం చేసిందంటే.

అపురూప దృశ్యం.. శివుడికి అభిషేకం చేసిన గంగమ్మ

Updated Date - Jul 03 , 2025 | 09:49 AM