Trigger Fish Lips: ఈ పెదాలు ఎవరివో తెలిస్తే షాకైపోవాల్సిందే..
ABN, Publish Date - Feb 04 , 2025 | 06:16 PM
ట్రిగర్ ఫిష్ అనే చేప పెదాలను చూసి జనాలు షాకైపోతున్నారు. అచ్చు మనిషి పేదాలు పోలినట్టున్న వీటి పెదాలు చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: నేటి సోషల్ మీడియా జమానాలో సెన్సేషనల్ అంశాలు సెకెన్ల వ్యవధిలో ప్రపంచమంతా విస్తరిస్తాయి. అందుకే నిత్యం ఏదోక ఆశ్చర్యకర ఘటన నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక వీటిపై జనాలు చేసే ఛలోక్తులు, హాస్యోక్తులకు లెక్కే లేదు. ప్రస్తుతం దాదాపు ఇలాంటి ఉదంతమే నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తోంది. ఓ వింత జీవి పెదాలు చూసి షాకైపోతున్న జనాలు రకరకాల కామెంట్స్‌తో నెట్టింట హోరెత్తిస్తున్నారు (Viral).
అందంగా కనిపించాలనే స్పృహ జనాల్లో పెరిగిపోయింది. కొందరు ముఖాన్ని కాంతివంతంగా చేసుకునేందుకు ప్రయత్నిస్తే మరికొందరు కళ్లు పెద్దవిగా కనబడేలా మేకప్ వేసుకుంటూ ఉంటారు. మరికొందరు పెదాలు నిండుగా కనిపించేందుకు రకరకాల ట్రీట్‌మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. అయితే, ఇలాంటి చికిత్సలేవీ లేకుండానే ఓ జీవి పెదాలు అచ్చు మనిషి పెదాలను పోలినట్టు ఉండటం నెట్టింట సంచలనంగా మారింది. దీంతో, ఆ జీవి ఎంటో తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి ప్రదర్శించారు.
Viral Video: ప్రేమికులు సరే.. పెళ్లైన వాళ్లూ ఇలా చేస్తే ఎలా?
ఆ వింత జీవి పెదాలు చూస్తే ఎవరైనా మనిషివి అని కచ్చితంగా అనుకుంటారు. అవి మనిషి పెదాలేనని తొలి చూపులో పొరపాటు పడతారు. కానీ కాస్త దగ్గరగా తరచి చూస్తే మాత్రం అసలు విషయం అర్థమవుతుంది. అవి మనిషివి కావన్న విషయం రూఢీ అవుతుంది.
ఇక జనాలు మాత్రం అది వింత జీవి కాదని చేప అని స్పష్టంగా చెప్పేశారు. అది ట్రిగర్ ఫిష్ అని కూడా కొందరు పేర్కొన్నారు. దాని ఆహారపు అలవాట్ల రీత్యా పెదాల ఆకారం అలా ఉందని చెప్పుకొచ్చారు. మనిషిని పోలినట్టు పెదాలు బల్లపరుపుగా ఉంటాయని, పళ్లు కూడా మనిషివిలాగే ఉన్నా కాస్త పదునుగా ఉంటాయని వివరించారు.
Oyo: ఓయో వల్ల రైల్వే ప్లా్ట్‌ఫామ్‌పై నిద్ర పోయా.. కస్టమర్ ఆవేదన
నిపుణులు చెప్పే దాని ప్రకారం, ప్రపంచంలో 30 నుంచి 40 వరకూ వివిధ జాతుల ట్రిగర్ చేపలు ఉన్నాయి. సముద్రాల్లో ఉండే ఈ చేపల పెదాలు ఇతర చేపలతో పోలిస్తే చాలా భిన్నాంగా ఉంటాయి. సముద్రపు నాచు మొదలు నత్త గుల్లల వరకూ అనేక రకాల జీవాలను ఇవి తింటుంటాయి. పునరుత్పత్తి కాలంలో ఇవి తమ గూడును కాపాడుకునేందుకు భీకర దాడులు చేస్తాయట. పగడపు దిబ్బల సమీపంలో ఇవి జీవిస్తాయట. ఇవన్నీ అటుంచితే వీటి పెదాల కారణంగా ఈ చేపల ఫొటోలు నెట్టింట తరచూ వైరల్ అవుతుంటాయట.
Updated Date - Feb 04 , 2025 | 06:16 PM