Share News

Oyo: ఓయో వల్ల రైల్వే ప్లా్ట్‌ఫామ్‌పై నిద్ర పోయా.. కస్టమర్ ఆవేదన

ABN , Publish Date - Feb 03 , 2025 | 08:38 PM

ఓయోలో హోటల్ గది బుక్ చేసుకున్న పాపానికి తాను చివరకు ఆ రాత్రంతా రైల్వే ప్లాట్‌ఫామ్‌పై నిద్రించాల్సి వచ్చిందంటూ ఓ వ్యక్తి నెట్టింట పంచుకున్న ఉదంతం ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది.

Oyo: ఓయో వల్ల రైల్వే ప్లా్ట్‌ఫామ్‌పై నిద్ర పోయా.. కస్టమర్ ఆవేదన

ఇంటర్నెట్ డెస్క్: ఓయో హోటల్‌ దిగిన గంటకే తనను బలవంతంగా బయటకు పంపేయడంతో రాత్రంతా రైల్వే ప్లాట్‌ఫామ్‌పై నిద్రపోయానంటూ ఓ వ్యక్తి నెట్టింట పంచుకున్న ఆవేదనపై పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ‘‘ఓయో మిమ్మల్ని రైల్వే ప్లాట్‌ఫామ్‌పై కూడా నిద్రపోయేలాగా చేయగలదు’’ అని సదరు కస్టమర్ తన ఆవేదనను ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. అదనపు డబ్బులు చెల్లించకపోతే హోటల్ గది కేటాయించనని హోటల్ మేనేజర్ తెగేసి చెప్పాడని అతడు వాపోయాడు (Viral).

తొలుత గదిని కేటాయించిన మేనేజర్ ఆ తరువాత మళ్లీ తన గది తలుపు కొట్టి అంత తక్కువ ధరకు గది ఇవ్వలేమని తెగేసి చెప్పినట్టు కస్టమర్ పేర్కొన్నాడు. అదనపు డబ్బులు ఇవ్వకపోతే గది ఖాళీ చేయాల్సి వస్తుందని అన్నాడు. తాము ఇందుకు నిరాకరిస్తే చివరకు బలవంతంగా బయటకు పంపించాడని అన్నాడు.


Shocking: వీళ్లేం తల్లిదండ్రులు! కన్నకూతురు ఎప్పటికీ చిన్న పిల్లలా ఉండాలని..

కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేసినా తన సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. తొలుత వారు మరో హోటల్ కేటాయించారని, అయితే, అక్కడ రిసెప్షన్‌లో ఎవరూ లేకపోవడంతో పాటు ఆ వాతావరణమంతా అనుమానాస్పదంగా ఉందని చెప్పాడు. మళ్లీ ఓయో కస్టమర్‌ కేర్‌కు ఫిర్యాదు చేస్తే రెండో హోటల్‌కు, ఆ తరువాత మరో హోటల్‌కు తిప్పారని కానీ ఏదీ ఉపయోగకరంగా లేకపోవడంతో చివరకు ఆ రాత్రంతా రైల్వే ప్లాట్‌ఫామ్‌‌పై తామందరం నిద్రించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

రిఫండ్ కూడా దొరకక, మరో హోటల్‌లో చెకిన్ అయ్యే అవకాశం లేకపోవడంతో చివరకు రాత్రి రైల్వే ప్లాట్‌ఫాంపైనే నిద్రించాల్సి వచ్చిందని తెలిపాడు.

Viral: జపాన్‌లో హృదయవిదారక ఘటన.. జైల్లో ఉండేందుకు నేరాలకు దిగిన 81 ఏళ్ల వృద్ధురాలు!


కాగా, ఈ ఉదంతం నెట్టింట విపరీతంగా వైరల్ అవడంతో ఏకంగా 17.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. తామూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నామని కొందరు చెప్పుకొచ్చారు. తక్కువ ధర కనిపిస్తోందని హోటల్ గది బుక్ చేసుకుంటే అక్కడికెళ్లాక అదనపు డబ్బులు వసూలు చేశారని మండిపడ్డారు. ఓయోలో తరచూ ఇలాంటి ఘటనలు ఎదురుచూస్తున్నాయని కొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ వద్ద ఈ ఉదంతం తెగ వైరల్ అవుతోంది.

Read Latest and Viral News,

Updated Date - Feb 03 , 2025 | 08:38 PM