Viral Video: ప్రేమికులు సరే.. పెళ్లైన వాళ్లూ ఇలా చేస్తే ఎలా?
ABN , Publish Date - Feb 03 , 2025 | 10:41 PM
పెళ్లైన ఓ యువ జంట కదులుతున్న రైలు డోర్ వద్ద నిలబడి ప్రేమమైకంలో మునిగిపోయిన తీరు నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: మెట్రో వంటి ప్రజా రవాణా సాధనాల్లో కొన్ని జంటలు కౌగిలింతలు, చుంబనాలకు దిగుతూ రోత పుట్టించిన సన్నివేశాలు అనేకం నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. వీటిలో కొన్ని మటుకూ ట్రెండవ్వాలనే ప్రయత్నంలో కంటెంట్ క్రియేటర్లు చేసిన ప్రయత్నాలే. కొన్ని సందర్భాల్లో మాత్రం యువ జంటలు హద్దు మీరుతుంటాయి. అయితే, తాజాగా వీడియోలో భార్యాభర్తల్లా కనిపిస్తున్న ఓ యువ జంట రైలు కదులుతుండగా తలుపు వద్ద నిలబడి సరససల్లాపాలకు దిగారు (Viral).
Oyo: ఓయో వల్ల రైల్వే ప్లా్ట్‌ఫామ్‌పై నిద్ర పోయా.. కస్టమర్ ఆవేదన
రైలు కదలుతుండగా ఆ జంట బహిరంగ ప్రేమ ప్రదర్శనకు పూనుకున్నారు. ఒకరికొకరు దగ్గరగా జరిగి తలుపు పక్కన నిలబడ్డారు. అంతకుమించి వారు అసభ్యకరమైన చర్యలేమీ చేయకపోయినా ప్రేమభావనలో మునిగితేలుతూ ప్రమాదకరంగా తలుపు వద్ద నిలబడంపై నెట్టింట అనేక మంది అభ్యంతరం వ్యక్తం చేశారు.
నేటి జమానాలో యువత హద్దు మీరుతోందని అనేక మంది కామెంట్ చేశారు. సడెన్‌గా కాలుజారి రైల్లోంచి కిందపడితే పరిస్థితి ఏమిటని కొందరు ప్రశ్నించారు. ఇది అసభ్యకరమైన తీరు అని కొందరు వ్యాఖ్యానించారు. ఇదేమీ వ్యూస్ కోసం చేసిన వీడియోలా కనిపించట్లేదని కొందరు అన్నారు. కేవలం నిర్లక్ష్యంతో ఇది చేసినట్టు ఉందని అభిప్రాయపడ్డారు. యువత సంగతి అంటుంచితే పెళ్లైన వాళ్లూ ఇలా చేయడం ఏమిటని కొందరు నోరెళ్లబెట్టారు.
Shocking: వీళ్లేం తల్లిదండ్రులు! కన్నకూతురు ఎప్పటికీ చిన్న పిల్లలా ఉండాలని..
కాగా, మెట్రోల్లో యువ జంటల సరససల్లాపాల వీడియో గతంలో పలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇలాంటి జంటలపై మెట్రో అధికారులకు ఫిర్యాదు చేయాలని అనేక మంది డిమాండ్ చేస్తుంటారు. నెట్టింట ఈ తరహా వీడియోలపై ఎంత వ్యక్తిరేకత వ్యక్తవుతున్నా ఇలాంటి ఉదంతాలు ఎక్కడో చోట వెలుగు చూస్తూ నెటిజన్లకూ కోపం తెప్పిస్తుంటాయి.
Viral: జపాన్‌లో హృదయవిదారక ఘటన.. జైల్లో ఉండేందుకు నేరాలకు దిగిన 81 ఏళ్ల వృద్ధురాలు!