ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: డోంట్ టచ్ మీ.. ఆహారం అందించి కోతిని ముట్టుకున్న యువతికి షాక్.. ఏం జరిగిందో చూడండి..

ABN, Publish Date - Jan 29 , 2025 | 03:12 PM

చాలా మంది ఏ చిన్న పని చేసిన సెల్ఫీలు, వీడియోలు తీసుకుని సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసుకుంటున్నారు. అందుకోసం వెరైటీ పనులు చేస్తున్నారు. ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. వన్య ప్రాణులతో ఆటలాడుతున్నారు. ఆ క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారు.

Langur Attack on Girl

ప్రస్తుత సోషల్ మీడియా రోజుల్లో ప్రతి విషయమూ ఫొటోలు, వీడియోల రూపంలో అందరికీ చేరవలసిందే. ఏ చిన్న పని చేసిన సెల్ఫీలు, వీడియోలు తీసుకుని సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసుకుంటున్నారు. అందుకోసం వెరైటీ పనులు చేస్తున్నారు. ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. వన్య ప్రాణులతో (Wild Animals) ఆటలాడుతున్నారు. ఆ క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా ఓ వీడియోలో యువతి అలాంటి పనే చేసింది. వీడియో కోసం కోతలకు (Monkey) ఆహారం అందించింది. ఓ కోతి తలపై చేతితో నిమిరింది. దాంతో ఆ కోతికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


music_my_life అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ అమ్మాయి గుడి మెట్ల మీద కొండముచ్చులకు ఆహారం అందించింది. ఆ అమ్మాయి ఇచ్చిన ఆహారాన్ని మూడు కొండ ముచ్చులు ఇష్టంగా తిన్నాయి. వాటికి ఆహారం ఇస్తూ వీడియో తీసుకుంటున్న యువతి ప్రేమగా ఓ కొండముచ్చు తల మీద చేయి వేసింది. దీంతో దానికి విపరీతమైన కోపం వచ్చింది. గట్టిగా కేకలు వేస్తూ ఆ అమ్మాయిపై దాడికి దిగింది. దాంతో ఆ అమ్మాయి భయపడి వెనక్కి తగ్గింది. అయినా ఆ కొండముచ్చు ఆగ్రహం చల్లారలేదు. ఆ అమ్మాయిపై కోపం ప్రదర్శించింది. దీంతో ఆ అమ్మాయి పారిపోయింది (Langur Attack on Girl).


ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 2.6 కోట్ల మందికి పైగా వీక్షించారు. 7 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``కోతి కూడా ఆ అమ్మాయిని ఎగతాళి చేస్తోంది``, ``అమ్మాయి టచ్ చేస్తే ఎవరైనా అలా చేస్తారా``, ``దానికి ఆ అమ్మాయి నచ్చలేదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

Optical Illusion: మీ కంటి పవర్ రేంజ్ ఎంత?.. ఈ ఫొటోలో చేప ఎక్కడుందో కనిపెట్టండి..


Viral News: ఫుడ్ స్టాల్ బోర్డుపై స్పెల్లింగ్ మిస్టేక్.. పొరపాటుగా నిజం చెప్పేశాడంటూ నెటిజన్ల ఫన్నీ కామెంట్లు..


Strange Job: ఓర్నీ.. ఇలా కూడా కోట్లు సంపాదించవచ్చా? ఈ వ్యక్తి జాబ్ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే..


Viral Video: స్కూటీ మీద వేగంగా వెళ్తున్న యువతికి అడ్డొచ్చిన బారికేడ్.. ఆమె ఏం చేసిందో చూడండి..


Optical Illusion: మీ కంటి చూపు అద్భుతం అయితే.. ఈ బాత్రూమ్‌లో కారు బొమ్మ ఎక్కడుందో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 29 , 2025 | 03:12 PM