Tiger Viral Video: బైకర్‌కు గుండె ఆగినంత పనైంది.. రోడ్డు మీద వెళ్తుండగా అతడి పరిస్థితి ఏంటంటే..
ABN, Publish Date - Mar 04 , 2025 | 06:14 PM
కొన్ని వీడియోలు ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉండి అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా వన్య ప్రాణులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉండి అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా వన్య ప్రాణులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డు మీద బైక్ (Bike) మీద వెళ్తున్న ఓ వ్యక్తికి షాకింగ్ అనుభవం ఎదురైంది (viral Video).
@paragenetics అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి బైక్ మీద నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మీద వెళ్తున్నాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా రోడ్డు పక్కన ఉన్న పొదల్లోంచి ఓ పులి (Tiger) బయటకు వచ్చింది. రోడ్డు మీదకు వచ్చి నిల్చుంది. దీంతో ఆ బైకర్ రోడ్డు మీదనే భయంభయంగా చూస్తూ ఆగిపోయాడు. ఆ పులి అతడి వైపు చూసి నెమ్మదిగా ముందుకు నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఆ పులి పూర్తిగా రోడ్డు దాటే వరకు ఆగి ఆ తర్వాతే వెళ్లాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 20 వేల మందికి పైగా వీక్షించారు. వందల మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. అలాంటి సందర్భంలో నిశబ్దంగా ఉండడమే మేలు, కదలితే పులి భయపడి దాడికి దిగుతుంది, ఆ వ్యక్తి నిజంగా మంచి పని చేశాడు, అడవులు కొట్టెయ్యడంతో వన్యప్రాణులకు ఇలా రాక తప్పడం లేదు అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Funny Viral Video: ప్రమాదం నుంచి కూడా లాభం పొందడం అంటే ఇదే.. వాహనదారులు ఏం చేస్తున్నారో చూడండి..
Ocean Waves video: అత్యంత ప్రమాదకరం.. సముద్రంలో ఇలా బాక్స్ అలలను ఎప్పుడైనా చూశారా?
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Mar 04 , 2025 | 06:14 PM