Share News

Funny Viral Video: ప్రమాదం నుంచి కూడా లాభం పొందడం అంటే ఇదే.. వాహనదారులు ఏం చేస్తున్నారో చూడండి..

ABN , Publish Date - Mar 04 , 2025 | 04:46 PM

తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో కొందరు వాహనదారులు అద్భుతంగా ఆలోచించారు. రోడ్డుపై ప్రమాదం జరిగితే దానిని తమకు అనుకూలంగా మార్చుకుని డబ్బులు మిగుల్చుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Funny Viral Video: ప్రమాదం నుంచి కూడా లాభం పొందడం అంటే ఇదే.. వాహనదారులు ఏం చేస్తున్నారో చూడండి..
Free car wash

ప్రమాదం జరిగినపుడు దాన్ని అవకాశంగా మార్చుకునే వారిని విజ్ఞులు అంటారు. ఎక్కడైనా అనుకోని ఘటన జరిగినపుడు అందులో నుంచి కూడా లాభం పొందే వారు కొందరు ఉంటారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అలాంటి ఎన్నో వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో కొందరు వాహనదారులు అద్భుతంగా ఆలోచించారు. రోడ్డుపై ప్రమాదం జరిగితే దానిని తమకు అనుకూలంగా మార్చుకుని డబ్బులు మిగుల్చుకున్నారు (Opportunity). ఆ వీడియో సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది (Viral Video).


@TheFigen అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. రోడ్డు మీద ఉన్న ఓ బ్రిడ్జ్‌కు అమర్చిన నీటి (Water) పైపు ఒక చోట పగిలిపోయింది. దాంతో ఆ పైప్ నుంచి నీరు ఎక్కువ ఫోర్స్‌తో కింద పడిపోతోంది. ఆ రోడ్డు మీద వెళ్తున్న వాహనదారులు ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్నారు. నీరు పడే ప్రదేశం నుంచి తమ కార్లను నడిపించారు. అక్కడకు రాగానే వాహనాలను కాస్తా స్లో చేశారు. దీంతో వాహనాల మీద దుమ్ము మొదలైనవి తొలగిపోయాయి. డబ్బుల ఖర్చు లేకుండానే కార్ వాష్ అయిపోయింది (Car Wash).


ఈ వీడియోను షేర్ చేసిన ట్విటర్ యూజర్ ఉచిత కార్ వాష్` అని క్యాప్షన్ ఇచ్చాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు లక్ష మందికి పైగా ఆ వీడియోను వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. చాలా డబ్బులు మిగులుతాయి`, `సూపర్ కార్ వాష్` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.


ఇవి కూాడా చదవండి..

Viral Video: మరదలికి మెరుపు వేగంతో షాకిచ్చాడు.. వరుడి టెక్నిక్ చూస్తే నవ్వాపుకోలేరు.. ఫన్నీ వీడియో వైరల్


Ocean Waves video: అత్యంత ప్రమాదకరం.. సముద్రంలో ఇలా బాక్స్ అలలను ఎప్పుడైనా చూశారా?


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 04 , 2025 | 04:55 PM