Share News

Ocean Waves video: అత్యంత ప్రమాదకరం.. సముద్రంలో ఇలా బాక్స్ అలలను ఎప్పుడైనా చూశారా?

ABN , Publish Date - Mar 03 , 2025 | 07:41 PM

సముద్రం ఉగ్రరూపం దాలిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణంగా ఆహ్లాదకరంగా కనిపించే సముద్రపు కెరటాలు రాకాసి అలలుగా విరుచుకుపడితే ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలోని సముద్రపు అలలు విచిత్రంగా కనిపించాయి.

Ocean Waves video: అత్యంత ప్రమాదకరం.. సముద్రంలో ఇలా బాక్స్ అలలను ఎప్పుడైనా చూశారా?
Most Dangerous Waves

సముద్రం (Sea) ఎంతో విశాలంగా, అందంగా ఉంటుంది. అదే సమయంలో అత్యంత భయంకరంగా కూడా ఉంటుంది. సముద్రం ఉగ్రరూపం దాలిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణంగా ఆహ్లాదకరంగా కనిపించే సముద్రపు కెరటాలు రాకాసి అలలుగా (Waves) విరుచుకుపడితే ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలోని సముద్రపు అలలు విచిత్రంగా కనిపించాయి. సముద్రంపై చతురస్రాకారంలో అలలు ఏర్పడుతున్నాయి (Most Dangerous Waves).


చతురస్రాకరంగా కనిపిస్తున్న ఆ అలలు చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి. అయితే సాధారణంగా అలాంటి అలలు బలమైన రిప్ టైడ్స్‌తో (strong rip tides) ముడిపడి ఉంటాయని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి అలలు కనిపిస్తే వెంటనే సముద్రానికి దూరంగా వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. వీటిని క్రాస్-సీ లేదా గ్రిడ్ తరంగాలు అని కూడా అంటారట. ఇలాంటి అలలు అత్యంత అరుదైనవి అయినప్పటికీ, అవి బలమైన, శక్తివంతమైన రిప్ టైడ్‌లతో సంబంధం కలిగి ఉంటాయని వీడియోను పోస్ట్ చేసిన యూజర్ కామెంట్ చేశారు.


ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంటనే అది విపరీతంగా వైరల్ అవుతోంది. @AMAZlNGNATURE అనే ట్విటర్ హ్యాండిల్‌లో పోస్ట్ అయిన ఈ వీడియోను 1.3 కోట్ల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 1.2 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది చాలా అందంగా, భయంకరంగా ఉంది``, ``అలాంటి అలలను నేనెప్పుడూ చూడలేదు``, ``ఇది ఏఐ వీడియో కాదు కదా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

Youtuber Video: ఓర్నీ.. వ్యూస్ కోసం ఇంతకు తెగిస్తారా? ఓ కుర్రాడు రైల్వే స్టేషన్‌లో ఏం చేశాడో చూడండి..


Viral Lion Video: మృగరాజు అయితే మాకేంటి.. సింహానికి చుక్కలు చూపించిన తేనెటీగలు..


Mumbai Hotel: చెప్పుల దొంగతనం.. హోటల్ యాజమాన్యం ట్రిక్ తెలిస్తే మతి పోవాల్సిందే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 03 , 2025 | 07:41 PM