Youtuber Video: ఓర్నీ.. వ్యూస్ కోసం ఇంతకు తెగిస్తారా? ఓ కుర్రాడు రైల్వే స్టేషన్‌లో ఏం చేశాడో చూడండి..
ABN , Publish Date - Mar 03 , 2025 | 06:39 PM
సోషల్ మీడియాలో వీక్షకులను ఆకట్టుకునేందుకు కొందరు విచిత్రమైన పనులు చేస్తూ వీడియోలను రూపొందిస్తున్నారు. ఆ క్రమంలో ఇతరులను ఇబ్బంది పెట్టేందుకు కూడా సిద్ధపడుతున్నారు. తాజాగా ఓ కుర్రాడు అలాంటి ప్రయత్నమే చేశాడు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిఒక్కరూ మొబైల్స్‌కు అతుక్కుపోతున్నారు. గంటల కొద్దీ సమయం ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వీక్షిస్తూ గడిపేస్తున్నారు. వీక్షకులను ఆకట్టుకునేందుకు కొందరు విచిత్రమైన పనులు చేస్తూ వీడియోలను రూపొందిస్తున్నారు. ఆ క్రమంలో ఇతరులను ఇబ్బంది పెట్టేందుకు కూడా సిద్ధపడుతున్నారు. తాజాగా ఓ కుర్రాడు అలాంటి ప్రయత్నమే చేశాడు. అయితే పోలీసులు సత్వరమే స్పందించి ఆ కుర్రాడికి తగిన బుద్ధి చెప్పారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
రైల్వే పోలీసులు ఆ వీడియోను ట్విటర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశాడు. వైరల్ అవుతున్న ఆ వీడియోను బీహార్ (Bihar)లోని అనుగ్రహ నారాయణ్ రోడ్ రైల్వే స్టేషన్‌లో చిత్రీకరించారు. సోషల్ మీడియాలో భారీగా వ్యూస్ సంపాదించాలనే వ్యామోహంతో ఓ కుర్రాడు కదులుతున్న రైలులో కూర్చున్న ప్రయాణికుడిని చెంపదెబ్బ కొట్టాడు (YouTuber slaps passenger). ఈ మొత్తం ఘటనను అతడి స్నేహితుడి రికార్డు చేసి, దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కొద్దిసేపటిలోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో బాగా వైరల్ అయి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) దృష్టికి వెళ్లింది. వారు వెంటనే రంగంలోకి నిందితులను అరెస్టు చేశారు.
ఆ వీడియోలోని వ్యక్తిని రితేష్ కుమార్‌గా గుర్తించిన రైల్వే పోలీసులు అతడిని, అతడి స్నేహితుడిని అరెస్ట్ చేశారు. అతడు క్షమాపణలు కోరుతున్న వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ``నేను ఓ యూట్యూబర్‌ని. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది ఫాలోవర్లను పొందడానికి నేను ఈ వీడియోను తయారు చేసాను. అనుగ్రహ్ నారాయణ్ రోడ్ రైల్వే స్టేషన్‌లో ఓ రైలు ప్రయాణికుడిని చెంపదెబ్బ కొట్టాను. ఇది నా తప్పు. నేను మళ్లీ అలా చేయను. దయచేసి నన్ను క్షమించండి`` అని ఆ వీడియోలో రితేష్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి..
Viral Lion Video: మృగరాజు అయితే మాకేంటి.. సింహానికి చుక్కలు చూపించిన తేనెటీగలు..
Mumbai Hotel: చెప్పుల దొంగతనం.. హోటల్ యాజమాన్యం ట్రిక్ తెలిస్తే మతి పోవాల్సిందే..
Optical Illusion: మీరు జీనియస్ అయితే.. ఈ ఫొటోలో కుందేలు ఎక్కడుందో 10 సెకెన్లలో కనుక్కోండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..