Viral Video: ఈ క్రియేటివిటీ చూస్తే కళ్లు తిరగడం ఖాయం.. స్కూటీ ఎంత వేగంగా వెనక్కు వెళ్తోందో చూడండి..
ABN, Publish Date - Jul 02 , 2025 | 03:56 PM
వెరైటీగా ఆలోచిస్తూ రకరకాల ప్రయోగాలు చేసే వారి వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో వైరల్ వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేశాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి స్కూటీతో వింత ప్రయోగం చేశాడు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వెరైటీగా ఆలోచిస్తూ రకరకాల ప్రయోగాలు చేసే వారి వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో వైరల్ వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేశాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి స్కూటీ (Scooty)తో వింత ప్రయోగం చేశాడు.
@RealTofanOjha అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ రోడ్డుపై చాలా వాహనాలు వేగంగా వెళ్లిపోతున్నాయి. అయితే ఓ స్కూటీ మాత్రం చూడడానికి చాలా విచిత్రంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆ స్కూటీపై ఓ వ్యక్తి వెనక్కి కూర్చుని డ్రైవ్ చేస్తున్నాడు. స్కూటీ వెనక్కి వేగంగా వెళ్లిపోతోంది. దగ్గరకు వెళ్లి చూస్తే అసలు విషయం అర్థమవుతోంది. స్కూటీ బ్యాక్ సీటుపై హ్యాండిల్‌ను అమర్చారు. ఆ హ్యాండిల్ ఆధారంగా ఆ వ్యక్తి ఆ స్కూటీని నడుపుతున్నాడు. ఆ వీడియో చూడగానే మొదట ఆ వ్యక్తి వెనక్కి నడుపుతున్నట్టుగానే అర్థమవుతుంది.
ఈ వెరైటీ స్కూటర్‌ను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 5.4 లక్షల మందికి పైగా వీక్షించారు. వందల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా స్పందించారు. ప్రపంచంలో చాలా మంది గొప్ప కళాకారులు ఉన్నారని, వారిలో ఇతను ఒక్కడని ఒకరు కామెంట్ చేశారు. ఇతడి కోసం ఆర్టీవో అధికారులు వెయిట్ చేస్తున్నారని మరొకరు ఫన్నీగా కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ఈమె పురుష ప్రపంచాన్నే భయపెడుతోంది.. ఉంగరాల ఆటలో ఆమె ఏం చేసిందంటే..
మీరు నిజంగా జీనియస్ అయితే.. ఈ ఫొటోలోని రెండు తప్పులను 10 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jul 02 , 2025 | 04:26 PM