Bride viral Video: ఈమె పురుష ప్రపంచాన్నే భయపెడుతోంది.. ఉంగరాల ఆటలో ఆమె ఏం చేసిందంటే..
ABN , Publish Date - Jun 30 , 2025 | 11:51 AM
పెళ్లి సమయంలో వధువు చాలా సిగ్గుపడుతుంది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో వధువు మాత్రం పరుషులందరినీ భయపెట్టేలా పోటీపడింది. చివరకు వరుడి మీద గెలిచి చూపించింది. ఆ సరదా కార్యక్రమానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివాహ (Wedding) కార్యక్రమంలో రకరకాల ఆచారాలు, సాంప్రదాయాలు ఉంటాయి. వధూవరుల మధ్య పోటీ కూడా ఉంటుంది. అలాంటి పోటీల్లో వధూవరులు కాస్తా సిగ్గుపడుతూనే పాల్గొంటారు. ముఖ్యంగా వధువు (Bride) అయితే మరింతగా సిగ్గుపడుతుంది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో వధువు మాత్రం పరుషులందరినీ భయపెట్టేలా పోటీపడింది. చివరకు వరుడి (Groom) మీద గెలిచి చూపించింది. ఆ సరదా కార్యక్రమానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
khushiphotostudiobarjal అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. వివాహ తంతులో భాగంగా నీటిలో ఉంగరాన్ని వేసి పట్టుకునే కార్యక్రమం జరుగుతోంది. వధూవరులు ఉత్సాహంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. వధూవరులు ఇద్దరూ ఉంగరాన్ని వెతికేందుకు పోటీ పడ్డారు. ఇద్దరి మధ్య రెజ్లింగ్ జరిగింది. వధువు చివరి వరకు పోరాడింది. చివరకు వరుడి చేతిలోని ఉంగరాన్ని బలవంతంగా లాక్కుని గెలిచింది. దీంతో అక్కడున్న వారందరూ నవ్వుకున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
ఈ వైరల్ వీడియోను పది లక్షల మందికి పైగా వీక్షించారు. 1.47 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. అది ఒక ఆచారం మాత్రమే, కుస్తీ పోటీ కాదు అని ఒకరు కామెంట్ చేశారు. ఆమెను చూసి మొత్తం పురుష ప్రపంచం భయపడుతోందని మరొకరు పేర్కొన్నారు. ఆ తర్వాతి రోజు నుంచి వరుడికి చుక్కలు కనబడతాయని మరొకరు సరదాగా కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ఆ జీబ్రా పోరాటానికి హ్యాట్సాఫ్.. నీటిలో మొసళ్ల నుంచి ఎలా తప్పించుకుందో చూడండి..
మీది చురుకైన చూపైతే.. ఈ ఫొటోలో కుందేలు ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..