Viral Video: ఫోన్ దొంగతనం.. రైలు డోరు దగ్గర వేలాడుతూ..
ABN, Publish Date - Jul 25 , 2025 | 03:25 PM
Viral Video: వేగంగా వేళుతున్న రైలు డోరు కింది భాగంలో వేలాడ సాగాడు. అయినా ఫోన్ యజమాని, మరో వ్యక్తి దొంగను వదల్లేదు. కాళ్లు, చేతులు చివరకు బెల్టుతో కూడా కొట్టడం మొదలెట్టారు.
ఓ దొంగ రైలులో దొంగతనం చేసి అడ్డంగా దొరికి పోయాడు. ఫోన్ యజమాని, రైలులోని ఇతర ప్రయాణికులు దొంగను రక్తం వచ్చేలా కొట్టారు. అంతటితో ఆగకుండా అతడి ప్రాణాలతో తోటే చెలగాటం ఆడారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి రైలులో దొంగతనం చేస్తూ దొరికి పోయాడు. ఫోన్ యజమాని, రైలులోని ఇతర ప్రయాణికులు దొంగను చావగొట్టారు. రక్తం వచ్చేలా కొట్టినా వారి కోపం చల్లారలేదు. వారి దెబ్బలు తట్టుకోలేక దొంగ డోరు దగ్గరకు పరిగెత్తాడు.
వేగంగా వేళుతున్న రైలు డోరు కింది భాగంలో వేలాడ సాగాడు. అయినా ఫోన్ యజమాని, మరో వ్యక్తి దొంగను వదల్లేదు. కాళ్లు, చేతులు చివరకు బెల్టుతో కూడా కొట్టడం మొదలెట్టారు. తనను కొడితే.. కాళ్లు పట్టుకుని లాగి కిందపడేస్తా అని బెదిరించినా వాళ్లు వెనక్కు తగ్గలేదు. దొంగను కొడుతూనే ఉన్నారు. వేగంగా వెళుతున్న రైలు నుంచి దొంగ కిందపడితే ప్రాణాలు పోతాయని తెలిసినా.. వాళ్లు మాత్రం మానవత్వం మర్చిపోయి ప్రవర్తించారు. ఆ దొంగ కొన్ని నిమిషాల పాటు అలాగే వేలాడుతూ ఉన్నాడు.
దాదాపు 10 నిమిషాల తర్వాత అతడు పొదల్లోకి దూకేశాడు. సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలీదు కానీ, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు..‘వాళ్లు ఎంత క్రూరంగా ప్రవర్తించారు. రక్తం వచ్చేలా కొట్టినా పగ చల్లారలేదు. కిందపడితే చస్తాడని తెలిసినా కొడుతూనే ఉన్నారు. మానవత్వాన్ని మరిచిపోయారు. సిగ్గుచేటు’..‘దొంగను శిక్ష పడాలి కానీ, అలా అతడ్ని అలా హింసించటం మంచిది కాదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
కారు బీభత్సం.. డివైడర్‌ను ఢీకొట్టి.. ఇంటి గోడ ఎక్కి..
డ్రోన్ ద్వారా మిసైల్‌ను ప్రయోగించిన డీఆర్‌డీఓ
Updated Date - Jul 25 , 2025 | 03:26 PM