Viral Monkey Video: కోతులతోనే చిలిపి పని.. వీడియో చూస్తే నవ్వాపుకోవడం కష్టం..
ABN, Publish Date - Jan 26 , 2025 | 08:19 PM
తాజాగా ఓ ఫన్నీ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి చేసిన పని కోతులను హడలెత్తించింది. దెబ్బకు ఆ కోతులన్నీ వెనుకా ముందూ చూడకుండా పరుగులు పెట్టాయి. ఆ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటూ, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ ఫన్నీ వీడియో (Funny Videos) నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి చేసిన పని కోతులను (Monkeys) హడలెత్తించింది. దెబ్బకు ఆ కోతులన్నీ వెనుకా ముందూ చూడకుండా పరుగులు పెట్టాయి. ఆ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
@Siimplymee1234 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. చాలా కోతులు ఒకే చోట కూర్చొని ఉన్నాయి. అప్పుడు ఒక బాలుడు అక్కడకు వచ్చాడు. అక్కడ కింద ఉన్న ఓ వస్తువు మీద కప్పిన వస్త్రాన్ని తొలగించాడు. అక్కడ పులి బొమ్మ ఉంది. ఆ పులి బొమ్మను చూసి కోతులన్నీ హడలిపోయాయి. ఉన్నపళంగా అన్ని కోతులు అక్కడి నుంచి పారిపోయాయి. కొన్ని కోతులు స్తంభాలు కూడా ఎక్కేశాయి. పులి బొమ్మను చూసి కోతులు భయపడి పారిపోవడం చాలా మందికి నవ్వు తెప్పిస్తోంది.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 83 వేల మంది ఈ వీడియోను వీక్షించారు. 12 వందల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను వీక్షించారు. ఆ వీడియోపై తమ స్పందనలను తెలియజేశారు. ``మనిషి కోతులపై ప్రతీకారం తీర్చుకున్నాడు``, ``ఆ కుర్రాడు కోతి కంటే చిలిపిగా ఉన్నాడు``, ``ఆ కోతులు ఒక్కసారిగా హడలిపోయాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: వేప పుల్లతో తోమిన పళ్లు అవి.. ఆ కుర్రాడి దంత శక్తిని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితే.. ``8``ల మధ్యనున్న ``6``ను కనిపెట్టండి..
Funny Viral News: భర్త మొహానికి లాక్.. బోనులో బంధించిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే..
Snake bite video: పాపా.. పాముతో ఆటలాడితే అలాగే ఉంటుంది.. ఓ యువతి పరిస్థితి ఏమైందో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Jan 26 , 2025 | 08:19 PM