ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Business Plan: ఇండియాలో ఇప్పుడిదే డ్రీమ్ బిజినెస్.. నెలకు ఎంత సంపాదనో తెలుసా?

ABN, Publish Date - Mar 04 , 2025 | 07:23 PM

ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ వంటి నగరాలకు వలస వెళ్లిపోతున్నారు. నగరాల్లో ఉద్యోగాల కొరత లేకపోవడంతో అక్కడే ఏదో పని చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. అలాంటి వారికోసం దాదాపు ప్రతి నగరంలోనూ పేయింగ్ గెస్ట్ హాస్టల్స్ ఉంటున్నాయి.

Business plan

ప్రస్తుతం మన దేశంలో నగరాలు (City) కిటకిటలాడుతున్నాయి. చదువుల కోసం, ఉద్యోగాల కోసం, పనుల కోసం ప్రజలు నగరాల బాట పడుతున్నారు. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ వంటి నగరాలకు వలస వెళ్లిపోతున్నారు. నగరాల్లో ఉద్యోగాల కొరత లేకపోవడంతో అక్కడే ఏదో పని చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. అలాంటి వారికోసం దాదాపు ప్రతి నగరంలోనూ పేయింగ్ గెస్ట్ హాస్టల్స్ (PG Houses) ఉంటున్నాయి. నెలకు డబ్బులు కడితే ఆహారం, ఆవాసం కోసం వెతుక్కోవాల్సిన పని ఉండదు. ప్రస్తుతం మనదేశంలో ఇదే బెస్ట్ ట్రెండింగ్ బిజినెస్‌గా మారిపోయింది (Business Idea).


ముఖ్యంగా బెంగళూరు (Bengaluru)లో పీజీ హౌస్‌లు నడిపేవాళ్లు పెట్టుబడి అంతా పోగా మూడు నుంచి నాలుగు లక్షల వరకు సంపాదిస్తున్నారు. తాజాగా మోనాలికా పట్నాయక్ అనే మహిళ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెంగళూరులో పీజీ హౌస్ యజమాని కావడమే నా డ్రీమ్. పెద్దగా కష్టపడకుండానే నెల పూర్తయ్యేసరికి భారీగా డబ్బు సంపాదించవచ్చు అంటూ ఆమె ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. చాలా మంది బెంగళూరులోని పీజీ వ్యవస్థపై విమర్శలు చేశారు. బెంగళూరులో చాలా అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తారని కామెంట్ చేశారు (Bengaluru PG House).


ఇప్పుడు భారతదేశంలో స్టార్టప్‌లు అక్కర్లేదు. బెంగళూరులో పీజీ హౌస్ యజమాని అయితే చాలు.. పెట్టుబడి అక్కర్లేదు. అపరిమిత రాబడి. గొప్ప వ్యాపారం, బెంగళూరులోని పీజీ యజమానులు నెలకు రూ. 2.5 నుంచి 5 లక్షల వరకు సులభంగా సంపాదిస్తున్నారు, మనదేశంలోని చాలా నగరాల్లో పీజీలకు మించిన గొప్ప వ్యాపార ఐడియా లేదు అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

Tiger Viral Video: బైకర్‌కు గుండె ఆగినంత పనైంది.. రోడ్డు మీద వెళ్తుండగా అతడి పరిస్థితి ఏంటంటే..


Funny Viral Video: ప్రమాదం నుంచి కూడా లాభం పొందడం అంటే ఇదే.. వాహనదారులు ఏం చేస్తున్నారో చూడండి..

Viral Video: మరదలికి మెరుపు వేగంతో షాకిచ్చాడు.. వరుడి టెక్నిక్ చూస్తే నవ్వాపుకోలేరు.. ఫన్నీ వీడియో వైరల్


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 04 , 2025 | 07:23 PM