ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kuberaa Movie: కుబేర సినిమా చూస్తుండగా కూలిన థియేటర్ సీలింగ్

ABN, Publish Date - Jun 26 , 2025 | 05:34 PM

Kuberaa Movie: కుబేర సినిమాలో బిచ్చగాడిగా ధనుష్, మాజీ సీబీఐ అధికారిగా నాగార్జున, ప్రేమలో విఫలమైన యువతిగా రష్మిక అద్భుతంగా నటించారు. నాగార్జున నటన కొత్తగా అనిపిస్తుంది.

Kuberaa Movie

శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. రోజురోజుకు కలెక్షన్లు పెరుగుతూ పోతున్నాయి. థియేటర్లు కళకళ్లాడుతున్నాయి. అయితే, తెలంగాణలోని ఓ థియేటర్‌లో కుబేర సినిమా చూస్తుండగా సీలింగ్ కుప్పకూలింది. సినిమా చూస్తున్న ప్రేక్షకులపై పడింది. ఈ సంఘటన తెలంగాణలోని మహబూబాబాద్‌లో చోటుచేసుకుంది.

ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్‌లోని ముకుందా థియేటర్‌లో కుబేర సెకండ్ షో చూస్తుండగా.. థియేటర్ సీలింగ్ కూలింది. సినిమా చూస్తున్న ప్రేక్షకులపై పడింది. దీంతో పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు థియేటర్ యాజమాన్యంతో గొడవకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

3 గంటల సినిమా.. అస్సలు బోరు కొట్టదు..

కుబేర సినిమాలో బిచ్చగాడిగా ధనుష్, మాజీ సీబీఐ అధికారిగా నాగార్జున, ప్రేమలో విఫలమైన యువతిగా రష్మిక అద్భుతంగా నటించారు. నాగార్జున నటన కొత్తగా అనిపిస్తుంది. అన్ని పాత్రల్లో పాత ఛాయలు కనిపించకుండా దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇప్పటి వరకు లవ్ స్టోరీలతో మెప్పించిన శేఖర్.. ఇప్పుడు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తోనూ వావ్ అనిపించాడు. విలన్‌తో పాటు మిగిలిన పాత్రలు కూడా తమ పరిధి మేర అద్భుతంగా అనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

రీల్స్ చేస్తుండగా అనుకోని విషాదం.. పాపం యువతి..

ఒట్టి చేతులతో చిరుతపులితో పోరాటం..

Updated Date - Jun 26 , 2025 | 05:48 PM