ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Black Holes: కృష్ణబిలం శబ్దాలు.. సోనిఫికేషన్ ద్వారా కనుగొన్న నాసా

ABN, Publish Date - May 13 , 2025 | 04:31 PM

బ్లాక్‌హోల్స్ అంతర్జాతీయ పరిశోధన సంస్థలు ఎన్ని అంశాలను బయటపెట్టినా ఇంకా ఎన్నో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. అమెరికా అంతరక్షి పరిశోధన సంస్థ అయిన నాసా ఇప్పటికే బ్లాక్‌హోల్స్‌కు చెందిన ఎన్నో విశేషాలను వెలుగులోకి తీసుకొచ్చింది. తాజాగా మరో ఆశ్చర్యకర అంశాన్ని వెల్లడి చేసింది.

Black Holes

కృష్ణబిలం (Black Holes) అనేది ఎప్పటికీ అంతు చిక్కని రహస్యమే. అంతర్జాతీయ పరిశోధన సంస్థలు ఎన్ని అంశాలను బయటపెట్టినా ఇంకా ఎన్నో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. అమెరికా అంతరక్షి పరిశోధన సంస్థ అయిన నాసా ఇప్పటికే బ్లాక్‌హోల్స్‌కు చెందిన ఎన్నో విశేషాలను వెలుగులోకి తీసుకొచ్చింది. తాజాగా మరో ఆశ్చర్యకర అంశాన్ని వెల్లడి చేసింది. కృష్ణబిలానికి చెందిన మూడు కొత్త శబ్దాలను నాసా (NASA) వెలుగులోకి తీసుకొచ్చింది.


సోనిఫికేషన్ (Sonification) ప్రక్రియ ద్వారా నాసా ఆ శబ్దాలను రికార్డ్ చేసింది. స్పేస్ టెలీస్కోప్ అందించిన డేటాను శబ్దాలుగా మార్చింది. అవి బ్లాక్‌హోల్స్‌ గురించి మరింత సమాచారాన్ని అందించనున్నాయి. ఈ ప్రక్రియ కోసం నాసా చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటరీ, జేమ్స్ వెబ్ స్పేస్ టెలీస్కోప్, ఇమేజింగ్ ఎక్స్‌రే పోలారిమెట్రీ ఎక్స్‌ప్లోరర్ వంటి పరికరాలను ఉపయోగించింది. వాటి ద్వారా ఆ మూడు శబ్దాలను శాస్త్రవేత్తలు రికార్డు చేశారు (Space Sounds From Black Holes).


బ్లాక్‌హోల్స్ అనేవి స్థిరంగా ఉండవు. అవి కాలంతో మారుతూ ఉంటాయి. కాలంతో పాటు వాటి పరిమాణంలో కూడా మార్పు వస్తుంది. అలాగే వాతావరణ పరిస్థితులు కూడా క్రమంగా మారుతుంటాయి. ఈ శబ్దాల ద్వారా బ్లాక్‌హోల్స్ డైనమిక్ నేచర్‌ను అర్ధం చేసుకోవచ్చని నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ మూడు శబ్దాల ద్వారా బ్లాక్‌హోల్ గురించి మరింత సమాచారాన్ని అధ్యయనం చేయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 13 , 2025 | 04:31 PM