ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nani Head Injury: నాని తలకు గాయం.. అయినా షూటింగ్ ఆపలేదు..

ABN, Publish Date - May 04 , 2025 | 07:15 PM

Nani Hit 3: నాని తల గాయానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలతో పాటు నాని షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Nani Hit 3

చిత్ర పరిశ్రమ అనే కాదు.. ఏ రంగంలోనైనా చేసే పనిలో ప్రాణం పెడితే సక్సెస్ దానంతట అదే వెతుక్కుంటూ వస్తుంది. సినిమా చరిత్రలో ఇప్పటికి వరకు స్టార్లుగా వెలుగొందుతున్న ప్రతీ ఒక్కరు కష్టపడి పైకి వచ్చిన వారే. కష్టనష్టాలకు ఓర్చుకున్న వారే సినిమాల్లో పైకి వస్తారు. ఇందుకు తాజా ఉదాహరణగా నిలిచారు న్యాచురల్ స్టార్ నాని. ఆయన నటించిన తాజా చిత్రం హిట్ 3 మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. థియేటర్లలో సక్సెస్ ఫుల్గా రన్ అవుతోంది.


షూటింగ్‌లో గాయపడ్డ నాని

హిట్ 3 షూటింగ్ సందర్భంగా నాని తలకు గాయం అయిందట. గాయం అంటే..చిన్నదేమో అనుకునేరు. కుట్లు పడేంతలా గాయం అయింది. నుదురు చీలింది. డాక్టర్లు అక్కడ కుట్లు వేశారు. తలకు అంత పెద్ద గాయం అయినా నాని షూటింగ్ ఆపలేదట. గాయం నొప్పి తీస్తున్నా అలాగే షూటింగ్ చేశారట. నాని తల గాయానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలతో పాటు నాని షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఆ వీడియోలో నాని తలకు గాయం ఎలా అయిందో తెలుస్తోంది. కాశ్మీర్ సీన్‌లో నాని కొంతమందిని కర్రతో కొడుతూ ఉన్నారు. వేగంగా తల పక్కకు తిప్పటంతో కెమెరా ఆయన తలకు తగిలినట్లు తెలుస్తోంది. ఆ కెమెరా బలంగా తాకటంతో గాయం అయినట్లు ఉంది. అదే సీన్‌లో ఆయన దిష్టి బొమ్మను ఆర్పడానికి ప్రయత్నించారు. అప్పుడు ఆయన చెయ్యి మంటల కారణంగా కాలింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను చూస్తున్న నెటిజన్లు నాని కమిట్‌మెంట్‌ను ప్రశంసిస్తున్నారు. ఆ కష్టం వల్లే బొమ్మ బ్లాక్ బాస్టర్ అయింది అంటున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. నానికి గాయం


ఇవి కూడా చదవండి

Operation Blue Star: రాహుల్ గాంధీకి మతి పోయే ప్రశ్న వేసిన సిక్కు యువకుడు

Class 10 Exam: టెన్త్ ఫెయిల్ అయిన కొడుకు.. ఘనంగా సెలెబ్రేట్ చేసిన తల్లిదండ్రులు

Updated Date - May 04 , 2025 | 07:20 PM