ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ganga River: పుణ్య స్నానం చేద్దామనుకుంటే ప్రాణాల మీద కొచ్చింది..

ABN, Publish Date - Jun 07 , 2025 | 08:31 AM

Ganga River: విశాల్ అనే వ్యక్తి శుక్రవారం హరిద్వార్‌లోని పవిత్ర గంగానదిలో పుణ్య స్నానం చేయడానికి వెళ్లాడు. గంగలో దిగి ఈత కొడుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు.

Ganga River

అదృష్టం అంటే ఇతడిదే.. నదిలో ఈత కొడుతుండగా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. సాధారణంగా అయితే, ఆ ప్రవాహంలో కొట్టుకుపోయిన జనాలు నీటిలో మునిగి చనిపోతూ ఉంటారు. కానీ, అతడికి మాత్రం భూమ్మీద నూకలు ఉన్నట్లు ఉన్నాయి. బ్రిడ్జి దగ్గర చైన్ యమలోకంలో ఎంటర్ అవ్వకుండా ఆపేసింది. ఆ వ్యక్తి నీటిలో కొట్టుకుపోతూ ఉండగా.. ఆ చైన్ దొరికింది. దాన్ని గట్టిగా పట్టుకుని నీటిలో ఉండిపోయాడు. కొద్ది సేపటి తర్వాత రెస్క్యూ టీమ్ వచ్చి అతడ్ని కాపాడింది. ఈ సంఘటన హరిద్వార్‌లోని గంగానదిలో శుక్రవారం చోటుచేసుకుంది.


సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. జమ్మూకాశ్మీర్‌కు చెందిన విశాల్ అనే వ్యక్తి శుక్రవారం హరిద్వార్‌లోని పవిత్ర గంగానదిలో పుణ్య స్నానం చేయడానికి వెళ్లాడు. గంగలో దిగి ఈత కొడుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. అయితే, అతడి అదృష్టం బాగుండి హతి బ్రిడ్జి దగ్గర ఉన్న చైన్ చేతికి దొరికింది. బతుకు జీవుడా అనుకుని దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ప్రవాహం ముందుకు తోస్తున్నా పట్టువిడవలేదు. నీటిలో చైన్ పట్టుకుని వేలాడుతున్న అతడ్ని అక్కడి వారు చూశారు.


వెంటనే హరిద్వార్ డిజాస్టర్ రిలీఫ్ టీమ్‌కు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే పడవలో అతడి దగ్గరకు చేరుకున్నారు. అతి కష్టం మీద అతడ్ని బోటులోకి చేర్చి రక్షించారు. బోటులోకి చేరగానే విశాల్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ‘నీ అదృష్టం బాగుంది బ్రో.. నీటిలో దిగేటప్పుడు నక్క తోక తొక్కినట్లు ఉన్నావు. అందుకే ప్రాణాలతో బయటపడ్డావు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

హీరో విశాల్‌కు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు..

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..

Updated Date - Jun 07 , 2025 | 08:49 AM