Viral: వామ్మో.. ఇతడు మామూలోడు కాదు.. పామును ఎలా పట్టాడో చూస్తే..
ABN, Publish Date - Feb 15 , 2025 | 09:07 PM
మంచినీళ్ల బాటిల్ ఉపయోగించి ఓ వ్యక్తి ఏకంగా నాగుపామునే పట్టిన తీరు నెటిజన్లను షేక్ చేస్తుంది. వేల కొద్దీ వ్యూస్‌తో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: పాముల్లోకెల్లా అత్యంత ప్రమాదకరం, విషపూరితమైనవి నాగు పాములే. వీటి పేరు వింటేనే ఒంట్లో వణుకు మొదలవుతుంది. ఇక అవి ఎదురుగా కనిపిస్తే గుండె ఆగిపోవడం పక్కా. పాములను పట్టడంలో నిష్ణాతులైన వారు కూడా నాగు పాము విషయంలో అప్రమత్తంగా ఉంటారు. అయితే, ఓ వ్యక్తి మాత్రం నాగు కాటేసేందుకు ప్రయత్నిస్తున్నా వెరవక దాన్ని ఓ ప్లాస్టిక్ బాటిల్‌లో అసాధారణ రీతిలో బంధించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది (Viral).
క్రేజీ క్లిప్స్ అనే ఎక్స్ అకౌంట్‌లో ఈ వీడియో పెట్టారు. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, బాత్రూమ్‌లోకొచ్చిన నాగును పట్టేందుకు ఓ వ్యక్తి వింత టెక్నిక్ వాడాడు, సాధారణంగా పాములను గోనె సంచుల్లో పడతారు. ముందుగా కొక్కేలతో వాటిని జాగ్రత్తగా పైకెత్తి సంచుల్లో పెడతారు. కానీ వీడియోలోని వ్యక్తి మాత్రం ఇందుకు భిన్నమైన టెక్నిక్ ఉపయోగించాడు.
Viral: రెండు చేతులూ పోగొట్టుకున్న మహిళ! సొరచేపతో ఫొటోలు దిగే ప్రయత్నంలో...
తొలుత అతడు ధైర్యంగా పామును సమీపించాడు. అతడిని చూడగనే అది బుసకొట్టింది. ఓసారి కాటేసేందుకు కూడా ట్రై చేసింది. కానీ ఆ వ్యక్తి మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. పక్కనే ఉన్న ఓ పెద్ద ప్లాస్టిక్ బాటిల్ మూత తీసి పాము ముందు పెట్టడంతో దాని దృష్టి మళ్లింది. ఈలోపు అతడు పట్టుకుని పామును బాటిల్ లోపలికి పంపించేందుకు ప్రయత్నించాడు. అతడి ప్రయత్నాలకు పాము లొంగలేదు. బాటిల్‌లోకి వెళ్లలేదు. మళ్లీ అతడు బాటిల్‌ను దాని తలదగ్గరకు తీసుకొచ్చాడు. ఈ సారి మాత్రం పాము ఆశ్చర్యకరంగా బాటిల్‌లోకి తలపెట్టి ఆపై లోపలకు వెళ్లిపోయింది. ఇదంతా చూసి చుట్టూ ఉన్న వారు ఆశ్చర్యపోయారు. ఇదెలా సాధ్యమైందో అనుకుంటూ నోరెళ్లబెట్టారు.
Viral: రూ.4 లక్షల టిక్కెట్‌తో విలాసవంతమైన ఫ్లైట్ జర్నీ! వీడియో చూసి షాకవుతున్న జనాలు
ఇక వీడియోపై నెట్టింట కూడా పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి. అతడు ఏదో మేజిక్ చేశాడని కొందరు అన్నారు. పామును పట్టేందుకు ఇంత కష్టపడాల్సిన అవసరం ఉందా? అని మరికొందరు ప్రశ్నించారు. ఇలాంటి పనులకు అతడికి ఎంత డబ్బు చెల్లించినా తక్కువే అని కొందరు అన్నారు. పామును చూస్తేనే చాలు తాము పరుగు లంఘించుకుంటామని మరికొందరు వ్యాఖ్యానించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది.
Updated Date - Feb 15 , 2025 | 09:07 PM