Share News

Viral: రూ.4 లక్షల టిక్కెట్‌తో విలాసవంతమైన ఫ్లైట్ జర్నీ! వీడియో చూసి షాకవుతున్న జనాలు

ABN , Publish Date - Feb 15 , 2025 | 05:23 PM

ఎతిహాద్ ఎయిర్‌వేస్ విమానంలోని కేబిన్‌లో ప్రయాణం ఫస్ట్ క్లాస్ జర్నీకంటే మిన్నగా ఉందంటూ చెన్నై జంట షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో సౌకర్యాలు చూసి జనాలు షాకైపోతున్నారు.

Viral: రూ.4 లక్షల టిక్కెట్‌తో విలాసవంతమైన ఫ్లైట్ జర్నీ! వీడియో చూసి షాకవుతున్న జనాలు

ఇంటర్నెట్ డెస్క్: మనలో చాలా మందికి విమానాల్లో ఎకానమీ టిక్కెట్‌పై ప్రయాణం తెలుసు. కాస్త స్థితి మంతులైతే ఫస్ట క్లాస్ లేదా బిజినెన్ క్లాస్‌లో ప్రయాణాలు చేస్తారు. ఇక సంపన్నులు మాత్రం ప్రత్యేకమైన ప్రైవేట్ జెట్‌లతో సకల సౌకర్యాల మధ్య ఫ్లైట్ జర్నీ ఎంజాయ్ చేస్తారు. అయితే, చెన్నైకి చెందిన ఓ జంట ప్రైవేట్ జెట్ జర్నీని తలదన్నే రీతిలో ఎతిహాద్ ఎయిర్‌వేస్‌లో ప్రయాణించింది. ది రిసెడిన్స్ అనే ప్రత్యేకమై కేబిన్‌లో తాము ప్రయాణించామంటూ ఆమె పంచుకున్న వీడియో నెట్టింట తెగ వైరల్ (Viral) అవుతోంది.

ఎతిహాద్ ఎయిర్‌వేస్‌ అందించే అత్యంత విలాసవంతమైన కేబిన్ ఇదేనని కీర్తి చెప్పుకొచ్చారు. ఈ కేబిన్ పేరు ది రెసిడెన్స్ అంటారని, విమానం మొత్తానికి ఒకే ఒక కేబిన్ ఉంటుందని ఆమె వివరించింది.


Viral: ఊహించని ట్విస్ట్.. కనిపించకుండా పోయిన భార్య ఆసుపత్రిలో అలా కనిపించే సరికి..

ఆమె తెలిపిన వివరాల ప్రకారం, ఈ కేబిన్‌లో మూడు గదులు ఉంటాయి. ఒక వ్యక్తి లేదా జంటలు కూడా ఈ కేబిన్‌ను బుక్ చేసుకోవచ్చు. ప్రైవేట్ జెట్‌కు మించిన సౌకర్యాలు ఇందులో ఉంటాయి. ఈ కేబిన్ టిక్కెట్ బుక్ చేసుకున్న వారికి జార్జియో అర్మానీ అమెనిటీ కిట్, రాత్రి నిద్రించే సమయంలో వేసుకునే దుస్తులు, చాక్లెట్లు వంటివి ఇస్తారు. ఇక కేబిన్‌లో ఒక బెడ్‌రూమ్, లాంజ్ ఏరియా, స్నానం చేసేందుకు ప్రత్యేకమైన షవర్ ఏరియా కూడా ఉంటుంది. ఇందులోని బెడ్స్‌ను కూడా క్యాబిన్ క్రూనే సర్ది పెడతారట. ఇక అక్కడి మెనూలోని ఆహారాల లిస్టు చదువుతుంటనే నోరూరుతుంది. అన్ని ఫుడ్స్ టేస్ట్ చేయాలని పిస్తుందట. ఇక లాంజ్‌లో టీవీతో పాటు విమానంలో వైఫై కూడా అందుబాటులో ఉంటుందట. అంతేకాకుండా తమ కేబిన్ దృశ్యాలను కూడ కీర్తి నెట్టింట పంచుకుంది. ఈ కేబిన్ ధర రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ ఉండొచ్చట.


Viral: భూటాన్‌లో భారతీయ పెట్రోల్ పంప్.. లీటర్ ఇంధనం ధర ఎంతో తెలిస్తే..

ఇక ఈ వీడియోకు కుప్పలు తెప్పలుగా వ్యూస్ వచ్చాయి. అనేక మంది ఈ విలాసవంతమైన జర్నీ చూసి ఆశ్చర్యపోయారు. లైఫ్‌లో ఇలాంటి ఫ్లైట్ జర్నీ ఒక్కసారైనా చేయాలని కొందరు కామెంట్ పెట్టారు. ఇంతటి విలాసవంతమైన జర్నీకి ఆ మాత్రం ఖర్చు పెట్టడంలో తప్పేమీ లేదని కొందరు అన్నారు. ఇక నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్న ఈ వీడియోకు ఇప్పటివరకూ 3.4 మిలియన్ వ్యూ్స్ వచ్చాయి. మరి మీరూ దీనిపై ఓ లుక్కేయండి.

ఇలాంటి సంస్థలు కూడా ఉంటాయా? నమ్మకస్తులైన ఉద్యోగులకు రూ.10 లక్షల బోస్!

Read Latest and Viral News

Updated Date - Feb 15 , 2025 | 05:28 PM