Startup Rewards Loyalty: ఇలాంటి సంస్థలు కూడా ఉంటాయా? నమ్మకస్తులైన ఉద్యోగులకు రూ.10 లక్షల బోస్!
ABN , Publish Date - Feb 14 , 2025 | 04:02 PM
కోయంబత్తూర్‌కు చెందిన ఓ స్టార్టప్ సంస్థ.. విశ్వాసపాత్రులైన 140 మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికీ దాదాపు రూ.10 లక్షల చొప్పున బోనస్ ప్రకటించింది.

ఇంటర్నెట్ డెస్క్: కోయంబత్తూర్‌లోని ఓ స్టార్టప్ సంస్థ ఓ కొత్త ఒరవడికి నాంది పలికింది. తమ సంస్థలో రెండేళ్లకు పైగా నమ్మకంగా పనిచేస్తున్న 140 మంది ఉద్యోగులకు ఏకంగా రూ.14.5 కోట్లు రూపాలయల బోనస్ ప్రకటించింది. అంటే.. ఒక్కో ఉద్యోగికి దాదాపు రూ.10 లక్షలు అందిందన్న మాట. ఇలా ఉద్యోగులపై కనకవర్షం కురిపించిన సంస్థ పేరు kovai.co.
కార్పొరేట్ రంగంలో సాధారణంగా ప్రతిభకు పట్టం కడతారు. కానీ ఈ సంస్థలో మాత్రం విశ్వాసపాత్రులకు ప్రతిఫలం దక్కింది. ఈ నిర్ణయానికి గల కారణాలను సంస్థ వ్యవస్థాపకులు, సీఈఓ శరవణ కుమార్ ప్రకటించారు. వారి పనితీరుతో పాటు సంస్థలో ఇన్నాళ్ల పాటు నమ్మకంగా ఉన్నందుకు ఈ విధంగా తాము కృతజ్ఞత వ్యక్తం చేసినట్టు తెలిపారు. ఈ బోనస్‌తో తమ ఉద్యోగులు ఆర్థిక భద్రతకోసం వెచ్చించారని పేర్కొన్నారు. కొందరు కార్లు కూడా కొన్నట్టు తెలిపారు (Viral).
Meta Layoffs: మహిళా ఉద్యోగికి షాక్.. ప్రసూతి సెలవుల తరువాత ఆఫీసుకొచ్చాక ఊస్టింగ్!
సాధారణంగా సంస్థలు ఉద్యోగులకు ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్లు, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు ఇస్తుంటాయి. అయితే, సంస్థ పబ్లిక్ ఆఫర్‌కు వెళ్లే వరకూ స్టాక్ ఆప్షన్లు అసలైన నగదుగా గుర్తింపు ఉండదని వివరించారు. ఇక పనితీరు ఆధారంగా పారితోషికం ఇచ్చే బదులు సంస్థ పట్ల విశ్వాసపాత్రంగా ఉన్న వారికి బోనస్‌తో గుర్తింపు ఇవ్వాలని అనుకున్నట్టు తెలిపారు.
Viral: భార్యపై ఎంత ప్రేమ ఉందో ఇలాంటి టైంలోనే తెలిసేది! కుంభమేళాలో క్యూట్ సీన్!
శరవణ కుమార్ గత 25 ఏళ్లుగా లండన్‌లో ఐటీ రంగ నిపుణుడిగా అనుభవం గడించారు. అయితే, దేశీయ ఐటీ రంగంలో ఉన్న అవకాశాలను గుర్తించి తిరిగొచ్చిన ఆయన సాస్ సంస్థను ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన సంస్థ క్లైంట్లల్లో బోయింగ్, బీబీసీ వంటి ప్రముఖ సంస్థలు కూడా ఉన్నాయి. సంస్థ సగటు వార్షిక ఆదాయం 15 మిలియన్ డాలర్లు. దీన్ని భవిష్యత్తులో 100 మిలియన్ డాలర్లు చేర్చి సంస్థను యూనీకార్న్ సాయికి తీసుకెళ్లాలన్నదే తన లక్ష్యమని ఆయన తెలిపారు.
ఇటీవల చైనా కంపెనీ కూడా తమ ఉద్యోగులకు ఇలాంటి అసాధారణ బహుమతి ప్రకటించిన విషయం తెలిసిందే. ఓ టేబుల్‌పై ఏకంగా రూ.70 కోట్లు కుప్పగా పోసి ఉద్యోగులు తాము లెక్కపెట్టగలిగినంత మొత్తాన్ని బోనస్‌గా ఇంటికి తీసుకెళ్లొచ్చని చెప్పుకొచ్చింది.
Viral: హోటల్ గది అద్దె గంటకు రూ.5 వేలు.. తట్టుకోలేక కుంభమేళా నుంచి తిరుగుప్రయాణం!