Meta Layoffs: మహిళా ఉద్యోగికి షాక్.. ప్రసూతి సెలవుల తరువాత ఆఫీసుకొచ్చాక ఊస్టింగ్!
ABN , Publish Date - Feb 12 , 2025 | 10:17 PM
సెలవులు ఎక్కువ తీసుకున్న వారినే మెటా తొలగిస్తోందంటూ ఓ మాజీ ఉద్యోగి చేసిన ఆరోపణ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. జనాలు షాకైపోయేలా చేస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్: ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటాలో లేఆఫ్ పర్వం కలకలానికి దారి తీస్తోంది. తాజాగా ఓ మహిళ ఉద్యోగి ప్రసూతి సెలవుల తరువాత ఆఫీసుకొచ్చాక తొలగింపునకు గురైంది. తనకు ఎదురైన అనుభవాన్ని నెట్టింట పంచుకున్న ఆమె సెలవులు తీసుకున్న వారినే సంస్థ నుంచి తొలగిస్తున్నారేమో అ అంటూ సందేహం వ్యక్తం చేసింది. దీంతో, ఈ ఉదంతంపై నెట్టింట చర్చమొదలైంది (Viral).
Viral: విమానంలో యువ ప్రయాణికుడిని చితక్కొట్టిన తోటి ప్యాసెంజర్!
ఇలేనా రేమాన్ సాఫ్నర్ అనే మెటా ఉద్యోగి తనకు ఎదురైన అనుభవాన్ని నెట్టింట పంచుకుంది. మూడేళ్లుగా మెటాలో పనిచేస్తున్న తను ఇటీవలే ప్రసూతి సెలవులు పూర్తి చేసుకుని ఆఫీసుకొచ్చినట్టు చెప్పింది.
గత వారమే తనకు ఉద్యోగం పోయిందని పేర్కొంది. తన పనితీరు బాలేదని తొలగిస్తున్నామంటూ మెటా ఇచ్చిన వివరణపై ఆమె అనుమానం వ్యక్తం చేసింది. గత మూడేళ్లలో తన పనితీరుపై మంచి రిపోర్టే వచ్చిందని చెప్పింది. దీంతో, తన ఉద్యోగం పోయిందని తెలిసి షాక్‌కు గురయ్యానని పేర్కొంది. అకస్మాత్తుగా ఇది జరగడంతో నాకు షాక్ తగిలిందని వెల్లడించింది. సెలవులు ఎక్కువగా తీసుకున్న వారినే సంస్థ తొలగిస్తోందని ఆరోపించింది. తనలా అనేక మంది మంచి పనితీరు కనబరిచి, సెలవులు తీసుకున్నారని, వారిలో చాలా మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారని తెలిపింది.
Viral: భార్యపై ఎంత ప్రేమ ఉందో ఇలాంటి టైంలోనే తెలిసేది! కుంభమేళాలో క్యూట్ సీన్!
అయితే, ఇంతకాలం తనకు సహకరించిన సహోద్యోగులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నట్టు ఆమె పేర్కొంది. మరోవైపు మెటా నాయకత్వంపై కూడా ఆమె విమర్శలు ఎక్కుపెట్టింది. అక్కడ మానసిక ఒత్తిడి ఎక్కువని, సంస్థ అధినేత అసాధారణ అంచనాలు అందుకోవడం కష్టమని చెప్పింది. సంస్థలో 5 శాతం మంది ఉద్యోగులను తొలగించేందుకు మెటా నిర్ణయించుకుంది. దీంతో 3600 మంది ఇంటిదారి పట్టకతప్పదని తెలుస్తోంది. ఉద్యోగుల పనితీరు ఆధారంగా ఈ తొలగింపులు చేపడుతున్నట్టు మెటా పేర్కొంది. ఐరోపా, ఆసియా, అమెరికాల్లో ఈ తొలగింపులు చేపట్టింది.
Viral: హోటల్ గది అద్దె గంటకు రూ.5 వేలు.. తట్టుకోలేక కుంభమేళా నుంచి తిరుగుప్రయాణం!