Share News

Viral: విమానంలో యువ ప్రయాణికుడిని చితక్కొట్టిన తోటి ప్యాసెంజర్!

ABN , Publish Date - Feb 12 , 2025 | 09:55 PM

విమానంలో చిప్స్ నేల మీద పడేసిన యువ ప్రయాణికుడికి తోటి ప్యాసెంజర్ దేహశుద్ధి చేశాడు. బ్రిటన్‌కు చెందిన ఈజీజెట్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Viral: విమానంలో యువ ప్రయాణికుడిని చితక్కొట్టిన తోటి ప్యాసెంజర్!

ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్‌కు చెందిన ఈజీ జెట్ విమానంలో ఓ ప్రయాణికుడు టీనేజర్‌పై చేయి చేసుకున్నాడు. అతడిని కదలకుండా పట్టుకుని పలుమార్లు చెంప చెళ్లుమనిపించాడు. విమానంలో చిప్స్ కింద పడేసిన టీనేజర్ వారించినా వినికపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, లండన్ నుంచి ఆమస్టర్‌డామ్ వెళుతున్న ఈజీ జెట్ విమానంలో ఈ ఘటన జరిగింది. విమానం బయలుదేరే ముందు ఇద్దరు యువ ప్రయాణికులు తమ సీట్లలో కూర్చుని చిప్స్ కింద పడేస్తూ చెత్త చేశారు. వారి కంటే వయసులో పెద్దవాడైన ఓ ప్రయాణికుడు యువకులను ఇది పద్ధతి కాదంటూ హెచ్చరించాడు (Viral).


Viral: భార్యపై ఎంత ప్రేమ ఉందో ఇలాంటి టైంలోనే తెలిసేది! కుంభమేళాలో క్యూట్ సీన్!

ఇది కాస్తా వారి మధ్య వాగ్యుద్ధానికి దారి తీసింది. ఈ క్రమంలో రెచ్చిపోయిన ఆ ప్రయాణికుడు ఆ యువ ప్యాసెంజర్‌ను గొంతును అదిమిపట్టి పలు మార్లు చెంప ఛెళ్లుమనిపించాడు. పక్కనే ఉన్న అతడి స్నేహితుడు వద్ద వద్దు అంటూ అతడిని వారించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అక్కడికొచ్చిన ఫ్లైట్ సిబ్బంది వారిద్దరినీ విడదీసి గొడవ చల్లారేలా చేశారు. చెంప ఛెళ్లుమనిపించిన ప్రయాణికుడిని మరో సెక్షన్‌లో కూర్చోపెట్టారు.


Viral: హోటల్ గది అద్దె గంటకు రూ.5 వేలు.. తట్టుకోలేక కుంభమేళా నుంచి తిరుగుప్రయాణం!

ఇక ఈ ఘటనలో తప్పు ఎవరిదనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విమానం అపరిశ్రుభంగా మార్చొద్దంటూ హితవు పలికినందుకు ఆ యువ ప్రయాణికులు అవమానకరంగా మాట్లాడారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో, సహనం నశించిన అతడు దాడికి తెగబడ్డాడని అన్నారు. యువకులను కొందరు తప్పుపట్టినా మరికొందరు మాత్రం దాడిని మాత్రం ఖండించారు. ‘‘నిజం చెప్పాలంటే యువకులదే తప్పు, వారే రెచ్చగొట్టేలా అవమానకరంగా మాట్లాడారు. దీంతో, పరిస్థితి చేయి దాటింది’’ అని ఓ ప్యాసెంజర్ అన్నాడు. ఈ ఉదంతం కారణంగా విమానం అరగంట పాటు ఆలస్యంగా బయలుదేరింది. ఫలితంగా ఇతర ప్రయాణికులు ఇబ్బందికి గురయ్యారు.

Read Latest and Viral News

Updated Date - Feb 12 , 2025 | 09:55 PM