Share News

Viral: ఊహించని ట్విస్ట్.. కనిపించకుండా పోయిన భార్య ఆసుపత్రిలో అలా కనిపించే సరికి..

ABN , Publish Date - Feb 15 , 2025 | 03:37 PM

నెల రోజుల క్రితం కనిపించకుండా పోయిన భార్య ఆసుపత్రిలో తన పక్క బెడ్‌పై కనిపించడంతో ఓ వ్యక్తి దిమ్మెరపోయాడు. ఆమె పాత జ్ఞాపకాలు మర్చిపోయిందని తెలిసి షాకయ్యాడు.

Viral: ఊహించని ట్విస్ట్.. కనిపించకుండా పోయిన భార్య ఆసుపత్రిలో అలా కనిపించే సరికి..

ఇంటర్నెట్ డెస్క్: సుమారు నెల రోజుల క్రితం అదృశ్యమైన భార్య ఆసుపత్రిలో తన పక్క బెడ్‌పై కనిపించడంతో ఓ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ఆమెకు పాత జ్ఞాపకాలను కూడా కోల్పోయిందని తెలిసి దిమ్మెరపోయాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది (Viral).

పూర్తి వివరాల్లోకి వెళితే, ఉన్నావ్ జిల్లాకు చెందిన 50 ఏళ్ల రాకేశ్ కుమార్ వృత్తి రీత్యా వెల్డర్. ఇటీవల ఓ రోజు అతడి భార్య కనిపించకుండా పోయింది. దీంతో, తల్లడిల్లిపోయిన అతడు ఆమె కోసం అనేక చోట్ల వెతికాడు. తానుంటున్న ప్రాంతంలో పాటు సమీపంలోని కాన్‌పూర్, లఖ్నవూ, కన్నౌజ్ నగరాల్లో కూడా వెతికాడు. కానీ ఆమె జాడ మాత్రం కానరాలేదు. దీంతో, దిక్కుతోచని స్థితిలో పడిపోయిన అతడు జనవరి 16న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళ కోసం గాలించడం మొదలెట్టారు.


Viral: భూటాన్‌లో భారతీయ పెట్రోల్ పంప్.. లీటర్ ఇంధనం ధర ఎంతో తెలిస్తే..

ఇక భార్య లేకపోవడంతో రాకేశ్ ఇంట్లో ఒంటరిగా ఉండలేకపోయాడు. అతడి పరిస్థితికి జాలి పడ్డ స్నేహితులు కొందరు అతడిని తమ ఇంట్లో ఆశ్రయం కల్పించారు. అయితే, వయసు పైబడటంతో రాకేశ్‌కు కాటరాక్ట్ వచ్చింది. రోజువారి పనులు కూడా చేసుకోలేని స్థితికి చేరుకున్నాడు. రాకేశ్ పరిస్థితి చూసి జాలిపడ్డ అతడి స్నేహితుడు కంటి ఆపరేషన్ చేయించుకోమని అతడికి సలహా ఇచ్చాడు. దీంతో, రాకేశ్ ఆసుపత్రిలో చేరాడు. ఆపరేషన్ తరువాత అతడు బెడ్‌పై ఉండగా బాగా పరిచయమున్న గొంతు వినిపించింది. ఆరా తీస్తే అది తన భార్యదే అన్న విషయం తెలిసిందే. కష్ట సమయంలో ఉండగా భార్య తిరిగొచ్చినందుకు అతడ సంబరం అంబరాన్ని అంటినా ఆ వెంటనే ఊహించని షాక్ తగిలింది. ఆమె తనను గుర్తు పట్టలేదని తెలిసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు.


TacoBell: ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్‌లో షాకింగ్ సీన్! మహిళా కస్టమర్ చెంప చెళ్లుమనిపించిన సెక్యూరిటీ గార్డు!

అయితే, ఆమె ఎదుర్కొంటున్న పరిస్థితి తాత్కాలికమే అని వైద్యులు రాకేశ్‌కు తెలిపారు. మెదడుపై బలమైన గాయంతో ఆమె ఆసుపత్రిలో చేరిందని వెల్లడించారు. తాను కోలుకున్నాక అతడు భార్యకు దగ్గరుండి సేవలు చేయడంతో ఆమెకు పాత జ్ఞాపకాలన్నీ ఒక్కొక్కటిగా తిరిగిరావడం ప్రారంభించాయి. ప్రస్తుతం ఆమె తనని తాను గుర్తించే స్థితికి వచ్చిందని అక్కడి వైద్యులు తెలిపారు.

ఇలాంటి సంస్థలు కూడా ఉంటాయా? నమ్మకస్తులైన ఉద్యోగులకు రూ.10 లక్షల బోస్!

Read Latest and Viral News

Updated Date - Feb 15 , 2025 | 03:37 PM