Share News

TacoBell: ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్‌లో షాకింగ్ సీన్! మహిళా కస్టమర్ చెంప చెళ్లుమనిపించిన సెక్యూరిటీ గార్డు!

ABN , Publish Date - Feb 14 , 2025 | 04:38 PM

ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో ఓ మహిళ కస్టమర్ చెంప చెళ్లుమనిపించిన సెక్యూరిటీ గార్డు వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అమెరికాలో వెలుగు చూసిన ఈ ఘటన జనాలు షాకయ్యేలాస్తోంది.

TacoBell: ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్‌లో షాకింగ్ సీన్! మహిళా కస్టమర్ చెంప చెళ్లుమనిపించిన సెక్యూరిటీ గార్డు!

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని ఓ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వద్దంటున్న వినకుండా ఫుడ్ కొనుగోలుకు ప్రయత్నించిన ఓ మహిళను రెస్టారెంట్‌లోని ఓ సెక్యూరిటీ గార్డు చెంప చెళ్లుమనిపించాడు. దీంతో, బిత్తరపోయిన మహిళ మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెనుదిరిగింది.

కాలిఫోర్నియాలోని ప్రముఖ మెక్సికన్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ టాకో బెల్‌లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ మహిళ రెస్టారెంట్‌లోని ఓ సెల్ఫ సర్వీస్ కియోస్క్‌‌లో ఏదో ఆర్డర్ పెట్టేందుకు ప్రయత్నించింది (Viral).

ఇలాంటి సంస్థలు కూడా ఉంటాయా? నమ్మకస్తులైన ఉద్యోగులకు రూ.10 లక్షల బోస్!


అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు ఆమెను వద్దని వారించాడు. కానీ ఆమె వినకపోవడంతో గట్టిగా ఆమె చెంప చెళ్లుమనిపించాడు. అంత పెద్ద తలుగుతుందని ఊహించని మహిళ ఒక్కసారిగా షాకైపోయింది. నోట మాటకూడా రాలేదు. ఆ తరువాత ఆమె అక్కడి నుంచి రెస్టారెంట్ డోర్ వద్దకు వెళ్లిపోయింది. ఆ తరువాత గార్డుతో వాగ్వాదానికి దిగిన మహిళ చివరకు అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ సమయంలో ఘటనా స్థలంలో ఉన్న ఓ వ్యక్తి ఇదంతా రికార్డు చేసి నెట్టింట పంచుకోవడంతో ఈ ఉదంతం వైరల్‌గా మారింది.


Meta Layoffs: మహిళా ఉద్యోగికి షాక్.. ప్రసూతి సెలవుల తరువాత ఆఫీసుకొచ్చాక ఊస్టింగ్!

‘‘మొదట ఆమెను వారించాడు. కానీ ఆమె వినలేదు. మరో ఆలోచన లేకుండా ఒక్కసారి ఆమె చెంప ఛెళ్లుమనిపించాడు. అది షాకింగ్ ఘటన. ఆ సీన్ కూడా అక్కడున్న వారందరూ నోరెళ్లబెట్టారు’’ అని సదరు వ్యక్తి చెప్పుకొచ్చాడు. సదరు మహిళ వీధుల్లో నివసించే వ్యక్తి అని, అందుకే ఆమెతో అంతలా గార్డు దురుసుగా ప్రవర్తించిన ఉంటాడన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, ఈ ఘటనపై టాకో బెల్ ఇంకా స్పందించాల్సి ఉంది. మరోవైపు వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై పెద్ద ఎత్తున స్పందిస్తున్న నెటిజన్లు.. మహిళపై చేయి చేసుకోవడం సబబు కాదని కామెంట్ చేశారు.

Viral: భార్యపై ఎంత ప్రేమ ఉందో ఇలాంటి టైంలోనే తెలిసేది! కుంభమేళాలో క్యూట్ సీన్!

Viral: హోటల్ గది అద్దె గంటకు రూ.5 వేలు.. తట్టుకోలేక కుంభమేళా నుంచి తిరుగుప్రయాణం!

Read Latest and Viral News

Updated Date - Feb 14 , 2025 | 05:32 PM