ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: తల్లి కోసం యువకుడి ఖరీదైన బహుమతి.. వైరల్ వీడియోపై నెట్టింట భిన్నాభిప్రాయాలు

ABN, Publish Date - Jan 19 , 2025 | 03:34 PM

తల్లి కోసం రూ.86 వేల విలువైన చెప్పులను కొనుగోలు చేసిన ఓ యువకుడి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: భారతీయ సంప్రదాయం ప్రకారం, కుటుంబంలో తల్లి స్థానం ఉత్కృష్ఠమైనది. తల్లే తొలి దైవం, తొలి గురువు. ఇక తల్లి పట్ల ప్రేమాభిమానాలు ఉండని వారు దాదాపుగా అరుదనే చెప్పాలి. తల్లికి నిత్యం కొందరు బహుమతులు ఇస్తుంటారు. మరి కొందరు ఇంటి పనుల్లో సాయ పడుతూ ఉంటారు. ఇదే కోవకు చెందిన ఓ యువకుడు తల్లికి ఇచ్చిన బహుమతి ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. తల్లి పట్ల అతడికి ఉన్న గౌరవాన్ని చూసి కొందరు ప్రశ్నిస్తుంటే మరీ ఇంత ఖరీదైన గిఫ్ట్ అవసరమా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు (Viral).


Viral: లండన్‌లో నెలకు రూ.లక్ష ఇంటి అద్దె కడుతున్నా తప్పని ఇక్కట్లు.. ఎన్నారై వీడియో వైరల్

కంటెంట్ క్రియేటర్ యదుప్రియన్ మెహతా తన తల్లి కోసం ఖరీదైన చెప్పుల జత కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను నెట్టింట పంచుకున్నాడు. న్యూయార్క్‌లోని క్రిస్టియన్ డియోర్ బ్రాండ్ చెప్పుల జతను కొన్నట్టు చెప్పారు. దాని ధర భారతీయ కరెన్సీలో చెప్పుకోవాలంటే రూ.86 వేలని అన్నాడు. ఆ తరువాత దాని ప్యాకింగ్ గురించి వర్ణించడంతో పాటు చెప్పుల జతను కూడా చూపించాడు. క్రిస్టియన్ డియోర్ బ్రాండ్ అంటేనే అత్యంత ఖరీదైన, విలాసవంతమైన వస్తువులకు ప్రసిద్ధి. ఈ బ్రాండ్‌లో దుస్తుల నుంచి పాదరక్షల వరకూ అనేకం అందుబాటులో ఉంటాయి. డబ్బు ఖర్చుకు వెనకాడకుండా తమ ప్రత్యేకతను చాటుకోవాలనుకునే వారు ఈ బ్రాండ్ వస్తువులు కొంటుంటారు.


Viral: ఇలా తయ్యారయ్యారేంట్రా బాబూ.. రైలు దిగేముందు ఈ ప్రయాణికులు ఏం చేశారో చూస్తే..

ఇక వీడియోలో ఇదంతా చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఖర్చుకు వెనకాడ కుండా తల్లికి ఖరీదైన బహుమతి ఇద్దామనుకున్న ఆ యువకుడిపై అనేక మంది ప్రశంసలు కురిపించారు. అతడికి తల్లిపై ఉన్న ఆపేక్ష గొప్పదని కొనియాడారు. కొందరు మాత్రం అతడి బహుమతిపై కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. తల్లిపై ప్రేమాభిమానాలు ఉండటం మంచిదే గానీ మరీ ఇలా డబ్బును దుబారా చేయడం తగదని అన్నారు. ఆ డబ్బుతో పేదలను, అనాథ చిన్నారులను ఆదుకోవచ్చని చెప్పారు. తల్లి పేరిట సామాజిక కార్యక్రమాలకు వినియోగించొచ్చని చెప్పుకొచ్చారు. కాళ్లకు వేసుకునే చెప్పులపై ఇంత పెద్ద మొత్తం ఖర్చుపెట్టడం సబబు కాదని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ వైరల్ అవుతంది. మరీ మీరూ ఈ ఆశ్చర్యకర వీడియోపై ఓ లుక్కేయండి.

Read Latest and Viral News

Updated Date - Jan 19 , 2025 | 03:34 PM