Share News

Viral: ఇలా తయ్యారయ్యారేంట్రా బాబూ.. రైలు దిగేముందు ఈ ప్రయాణికులు ఏం చేశారో చూస్తే..

ABN , Publish Date - Jan 18 , 2025 | 11:02 PM

రైల్లో అందించే బెడ్ షీట్లు చోరీ చేసి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన కొందరు ప్రయాణికుల వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రయాగ్‌రాజ్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. దీనిపై జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Viral: ఇలా తయ్యారయ్యారేంట్రా బాబూ.. రైలు దిగేముందు ఈ ప్రయాణికులు ఏం చేశారో చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: ఇప్పటికే రైల్వే అనేక సమస్యలతో సతమతమవుతోంది. రైళ్ల కొరత, విపరీతమైన రద్దీ, సౌకర్యాల లేమి, సేవా లోపాలు.. ఇలా ఎన్నో సమస్యలు రైలు ప్రయాణికులను ఇక్కట్ల పాలు చేస్తుంటాయి. ఇది చాలదన్నట్టు. రైలు ప్రయాణికులు చేసే కొన్ని తప్పులు సమస్యను మరింత జటిలం చేస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో ప్రయాణికులు చేసిందేంటో చూసి నెటిజన్లు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. వీళ్లింక మారరా అని ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు (Viral).


Viral: వామ్మో.. ఎంత ప్రమాదం తప్పింది! జిమ్‌కు వెళ్లేవాళ్లు తప్పక చూడాల్సిన వీడియో!

ప్రయాగ్‌రాజ్‌లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, కొందరు రైల్వే ప్రయాణికులు ఏకంగా రైల్లోనే తమ చేతివాటం ప్రదర్శించారు. రైలు దిగి వచ్చేటప్పుడు తమ వెంట రైల్లోని దుప్పట్లు కూడా తెచ్చుకున్నారు. అయితే, సిబ్బందికి వారిపై అనుమానం రావడంతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. సిబ్బంది వారి లగేజీ చెక్ చేసి దుప్పట్లను వెలికి తీశారు. ఆ తరువాత నిందితులపై ఫైరైపోయారు. ఇలా చేయొచ్చా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


Viral: చలికి గడ్డ కట్టుకుపోయిన కుక్క పిల్ల.. దాన్ని కాపాడేందుకు ఈ తల్లి కుక్క ఏం చేసిందో చూస్తే..

మరోవైపు నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. భారత్‌లో చాలా మందికి సివిక్ సెన్స్ లేదని మండిపడ్డారు. రైల్వేలో మురికిగా ఉండే దుప్పట్లను ఎవరైనా దొంగిలిస్తారా అంటూ కొందరు ఆశ్చర్యపోయారు. రైల్వే లోగో ఉన్న దుప్పట్లో బంధువులు, స్నేహితుల కంట పడితే పరువుపోదా అని కొందరు ప్రశ్నించారు. కొందరు మాత్రం నిందితులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారివల్లే రైల్వే పరువుపోతోందని అన్నారు. రైల్వే స్టేషన్‌లను అపరిశుభ్రంగా మార్చేవారు, చెత్తాచెదారం ఇష్టమొచ్చిన చోట వేసే వారు వీరేనని అన్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షిస్తే కానీ దారికి రారని చెప్పుకొచ్చారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ ట్రెండవుతోంది. మరీ మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

Read Latest and Viral News

Updated Date - Jan 18 , 2025 | 11:02 PM