Share News

Viral: వామ్మో.. ఎంత ప్రమాదం తప్పింది! జిమ్‌కు వెళ్లేవాళ్లు తప్పక చూడాల్సిన వీడియో!

ABN , Publish Date - Jan 18 , 2025 | 10:20 PM

జిమ్‌లో ఓ వ్యక్తి కసరత్తు చేస్తుండగా చేతిలోని వెయిట్స్ జారీ ముందున్న వ్యక్తి మీద పడబోయాయి. అయితే, అదే సమయంలో బాధితుడు ముందుకు తలవంచడంతో పెను ప్రమాదం తృటిలో తప్పిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Viral: వామ్మో.. ఎంత ప్రమాదం తప్పింది! జిమ్‌కు వెళ్లేవాళ్లు తప్పక చూడాల్సిన వీడియో!

ఇంటర్నెట్ డెస్క్: కుర్చీల్లో కదలకుండా చేసే ఉద్యోగాలు పెరిగిపోయిన ఈ రోజుల్లో దాదాపు అందరూ కసరత్తులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అనేక మంది రెగ్యులర్‌గా జిమ్‌కు వెళ్లడాన్ని ఓ అలవాటుగా మార్చుకున్నారు. అయితే, జిమ్‌ చేసేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు, ఎదురయ్యే ప్రమాదాలపై అవగాహన పెంచుకోవాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఎలాంటి రిస్క్‌లో పడాల్సి వస్తుందో చెప్పే ఓ షాకింగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియోలోని సీన్స్ చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు (Viral).

బ్రెజీల్‌లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఇది జరిగి చాలా కాలమే అవుతున్నా సోషల్ మీడియా జమానా కాబట్టి మరోసారి నెట్టింట వైరల్ అవుతూ జనాల్ని భయకంపితుల్ని చేస్తోంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ వ్యక్తి ఎప్పటిలాగే జిమ్‌లో కసరత్తులు చేసుకుంటున్నాడు. వెయిట్స్ పైకెత్తి కిందకు దించుతూ తనమానాన తాను కసరత్తులు చేసుకుంటున్నారు. తన పక్కనే మరో వ్యక్తి ఉన్నా పెద్దగా పట్టించుకోలేదు.


Viral: చలికి గడ్డ కట్టుకుపోయిన కుక్క పిల్ల.. దాన్ని కాపాడేందుకు ఈ తల్లి కుక్క ఏం చేసిందో చూస్తే..

ఈలోపు ఊహించని ప్రమాదం జరిగింది. వెనక నిలబడి వెయిట్స పైకెత్తి దించుతున్న వ్యక్తి అనుకోకుండా తడబడ్డాడు. చేతిలో వెయిట్స్ జారి ముందుగా నిలబడ్డ వ్యక్తి తలపై పడబోయాయి. అదే సమయంలో ముందున్న వ్యక్తి తన తలను అసంకల్పితంగా ముందుకు వంచడంతో అతడి తలపై పడాల్సిన వెయిట్స్ కాస్తా చేతికి తగిలాయి. దీంతో, ముందున్న వ్యక్తి తన చేతిలోని వెయిట్స్‌ను కూడా జార విడిచాడు. దీంతో, వెయిట్స్ రెండూ కిందపడిపోయాయి. భారీ బరువున్న ఈ వెయిట్స్ మీద పడి ఉంటే ముందున్న వ్యక్తి తలపగిలేదే. కానీ ఆ వ్యక్తి అదృష్టం కొద్దీ తల ముందుకు వాల్చడంతో పెను ప్రమాదం చిటికలో తప్పిపోయింది.


Viral: భారత పర్యటనకు వచ్చిన బ్రిటీషర్! అరటి పళ్లు కొందామని వెళితే భారీ షాక్

ఇక వీడియోలో ఇదంతా చూసిన జనాలు.. వెనక నిలబడ్డ వ్యక్తిపై నిప్పులు చెరిగారు. అంత బరువైన వెయిట్స్ ఎత్తే టప్పుడు అవతలి వారికి కాస్త దూరంగా ఉండాలన్న విషయం తెలియకపోతే ఎలా అంటూ దుమ్మెత్తిపోశారు. ఇలాంటి వారిని జిమ్‌లోకి రానీయకూడదని అన్నారు. శాశ్వతంగా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం నెట్టింట తెగ ట్రెండవుతోంది. మరీ ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Read Latest and Viral News

Updated Date - Jan 18 , 2025 | 10:52 PM