Viral: చలికి గడ్డ కట్టుకుపోయిన కుక్క పిల్ల.. దాన్ని కాపాడేందుకు ఈ తల్లి కుక్క ఏం చేసిందో చూస్తే..
ABN , Publish Date - Jan 18 , 2025 | 10:02 PM
చలికి గడ్డకట్టుకుపోయిన కుక్క పిల్లను తల్లి కుక్క ట్రీట్‌మెంట్ కోసం ఓ వెటర్నరీ క్లీనిక్‌కు తీసుకెళ్లింది. ఇస్తాంబుల్‌లో వెలుగు చూసిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: ఓ కుక్క తన పిల్లను ప్రాణాపాయం నుంచి కాపాడుకున్న తీరుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. కుక్క తెలివికి, తన పిల్లపై దానికున్న ప్రేమకు జనాలు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. తుర్కియేలోని ఇస్తాంబుల్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
బేలిక్‌డుజూ అనే ప్రాంతంలో బాగా వానకురవడంతో చలి పెరిగింది. దీంతో, ఓ కుక్క పిల్ల పెద్ద ప్రమాదంలో పడింది. చలికి తట్టుకోలేక అది అచేతనంగా మారింది. అయితే, చాలా సేపటి తరువాత అక్కడకు వచ్చిన తల్లి కుక్క దాని పరిస్థితి చూసి షాకైపోయింది (Viral).
అయితే, తన పిల్లను కాపాడుకునేందుకు తల్లి కుక్క ఆ సమయంలో ఓ అద్భుత ఐడియా వచ్చింది. వెంటనే కుక్క పిల్లను తీసుకుని పక్కనే ఉన్న వెటర్నరీ క్లీనిక్‌కు తీసుకెళ్లింది. క్లినిక్ తలుపులు వేసి ఉండటంతో కుక్కను బయటే వదలేసి లోపలి నుంచి ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూడసాగింది.
Viral: భారత పర్యటనకు వచ్చిన బ్రిటీషర్! అరటి పళ్లు కొందామని వెళితే భారీ షాక్
తల్లి కుక్క ఊహించినట్టుగానే అద్భుతం జరిగింది. తలుపు ముందు అచేతనంగా పడి ఉన్న కుక్క పిల్ల, కంగారుగా కనిపిస్తున్న తల్లి కుక్కను చూసి లోపలి సిబ్బంది ఒకరు బయటకు వచ్చారు. పిల్ల కుక్కను వెంటనే లోపలికి తీసుకెళ్లారు.
మొదట సిబ్బందికి కూడా పిల్ల కుక్క బతుకుతుందని అనిపించలేదు. అచేతనంగా పడి ఉన్న దాని గుండె చప్పుడు కూడా స్టెతొస్కోప్‌కు అందలేదు. దీంతో, మరో పరికరంతో దాన్ని పరీక్షించగా దాని గుండె చాలా నెమ్మదిగా కొట్టుకుంటున్నట్టు వెటర్నరీ డాక్టర్లు గుర్తించి వెంటనే చికిత్స ప్రారంభించారు. ఆ తరువాత అదృష్టవశాత్తూ వారి ప్రయత్నాలు ఫలించడంతో పిల్ల కుక్కలో చలనం వచ్చింది. క్రమంగా కోలుకుంది.
Viral: ఇన్ఫోసిస్‌లో 9 ఏళ్లు పనిచేసినా శాలరీ రూ.35 వేలు దాటలేదు.. టెకీ పోస్టు వైరల్
ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన వెటర్నరీ వైద్యులు ఇది నిజంగా అద్భుతమే అని అన్నారు. జంతువు మనుషులకంటే బలంగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో అవి కోలుకోవడం కష్టమని అన్నారు. ఇక ట్రీట్‌మెంట్ కోసం తల్లి కుక్క పిల్లల్ని క్లినిక్‌కు తీసుకురావడం నిజంగా ఆశ్చర్యమేనని అన్నారు. ప్రస్తుతం పిల్ల కుక్క బాగానే ఉన్నప్పటికీ మరికొన్ని రోజులు ఆగితే కానీ పరిస్థితి గురించి ఓ అంచనాకు రాలేమని అన్నారు. కాగా, తల్లి కుక్క తెలివికి జనాలు ఆశ్చర్యపోతున్నారు. వెటర్నరీ డాక్టర్లపై కూడా ప్రశంసలు కురిపించారు.